కఫాన్ని మింగేస్తే ఏమవుతుంది.. అసలు దాన్ని ఎలా కరిగించుకోవచ్చో తెలుసా?

చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నెన్నో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా వాటిలో కఫం సమస్య( Phlegm problem ) ఒకటి.

 Super Effective Home Remedies To Get Rid Of Phlegm , Phlegm, Phlegm Meltin-TeluguStop.com

గొంతులో కఫం చేరటం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.క‌ఫం కార‌ణంగా దగ్గు, ఆయాసం, శ్వాస‌ తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.

ఈ క్రమంలోనే కఫాన్ని కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే కఫాన్ని మింగేస్తే ఏమవుతుంది అన్న డౌట్ చాలా మందికి ఉంటుందికఫంలో బ్యాక్టీరియా ఉంటుందని, మింగడం వల్ల అది శరీరం మొత్తం పాకేస్తుందని ఎక్క‌వ శాతం మంది భావిస్తుంటారు.

అలాగే కఫాన్ని మింగేయడం వల్ల అది మరింత అధికం అవుతుందని కూడా అంటుంటారు.కానీ అలా అనుకుంటే పొర‌పాటే అవుతుంది.

వాస్త‌వానికి కఫం విషపూరితం కాదు.క‌ఫాన్ని మింగడం వల్ల ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.

కడుపులోకి వెళ్లిన కఫాన్ని శక్తివంతమైన యాసిడ్‌లు, ఎంజైమ్‌లు నాశనం చేస్తాయి.

Telugu Tips, Latest, Phlegm-Telugu Health

ఇక కఫాన్ని ఎలా కరిగించుకోవచ్చో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.కఫం పట్టేసింది అని బాధపడుతున్న వారు గోరు వెచ్చని నీటిని ఎక్కువగా తీసుకోండి.వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కఫం పల్చబడి పూర్తిగా తొలగిపోతుంది.

అలాగే ఉల్లిపాయ రసం( Onion juice )తో కూడా అన్ని క‌ఫాన్ని కరిగించవచ్చు.అందుకోసం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.

మూడు పూట్ల ఇలా చేస్తే కఫం దెబ్బకు కరిగిపోతుంది.

Telugu Tips, Latest, Phlegm-Telugu Health

క‌ఫం ఉన్న‌వారు ఒక గ్లాస్ పాలల్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి,( Pepper powder ) పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి వేసి మరిగించాలి.ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగిన తర్వాత.పాల‌ను ఫిల్ట‌ర్ చేసుకుని తేనె కలిపి సేవించాలి.

ఇలా రోజుకు ఒకసారి తీసుకున్నా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక మరో విధంగా కూడా క‌ఫాన్ని తొల‌గించుకోవచ్చు.

అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రెండు దంచిన యాలకులు వేసి మరిగించి.ఆ వాటర్ ని సేవించాలి.

ఇలా చేసినా కూడా కఫం కరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube