ఎన్నికలు మరో వారం కూడా లేవు.ఈ సోమవారంతో ఎలక్షన్స్ ప్రచారం కూడా ముగుస్తుంది.
ఇలాంటి చివరి క్షణాల్లో సేఫ్టీ జోన్స్ వెతుక్కుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders).ఇన్ని రోజులు పార్టీలోనే ఉండి ఇప్పుడు ఎందుకు సేఫ్టీ జోన్లు వెతుక్కుంటున్నారు అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది.
మరి బీఆర్ఎస్ నాయకులు సేఫ్టీ జోన్స్ వెతుక్కోవడానికి కారణం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.బీఆర్ఎస్ నేత అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం (Abraham) కి ఈసారి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకి ఇచ్చారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు మొదట్లో ఖరారు చేసినప్పటికీ బీఫాం మాత్రం ఆయనకి ఇవ్వలేదు.
దాంతో ఆయనకు టికెట్ రాలేదని అర్థమైంది.
అయితే తాజాగా ఆయన రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈయన మాత్రమే కాకుండా రాహుల్ గాంధీ సమక్షంలో మండవ వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ లోనే కొనసాగి ఈ చివరి క్షణాల్లో ఎందుకు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు అని అందరూ భావిస్తున్నారు.అలాగే టికెట్ వచ్చాక అసంతృప్తితో పార్టీ నుండి జంప్ అవ్వాలి లేదా పార్టీలో ఎవరు తమని పట్టించుకోవడం లేదని,బుజ్జగించడం లేదని, వేరే పదవి ఇస్తామని చెప్పడం లేదని కోపంతో ఆ పార్టీ నుండి బయటికి రావాలి.
కానీ ఇలా ఇన్ని రోజులు ఆ పార్టీలోనే కొనసాగి చివరి క్షణాల్లో ఇలా వేరే పార్టీలోకి జంప్ అవ్వడం పట్ల చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అంతే కాదు ప్రజలు కూడా ఈ విషయంలో ఏదో మతలబు ఉంది అని భావిస్తున్నారు.అయితే అసలు విషయం ఏమిటంటే.చాలా మంది బీఆర్ఎస్ నాయకులు తమ సొంత పార్టీకి ఎదురుపవనాలు వీస్తున్నాయని,అందుకే ఈ పార్టీలో ఉండడం కంటే కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ అని చివరి క్షణాల్లో ఇలా సేఫ్టీ జోన్స్ చూసుకుంటున్నారట.
అంతే కాదు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ లో ఉన్నట్లే ఉండి తెర వెనుక కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతూ పార్టీ ఫామ్ అయితే ఇక్కడే లేకపోతే ఎన్నికల రిజల్ట్ లో ఏమాత్రం తేడా కొట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ లోకి జంపవ్వాలని నిర్ణయించుకున్నారట.అంతేకాదు ఇప్పటినుండే తమకి అనుకూలమైన స్థానాలు, పదవులను ఆశిస్తున్నారట.ఇలా తెర వెనుక వీరి రాజకీయం వీరే చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రజల్లో కూడా ఇన్ని రోజులు పార్టీలోనే ఉండి ఇప్పుడు ఎందుకు అలా పార్టీని వీడుతున్నారు అని అనుమానాలు మొదలయ్యాయి.
మొత్తానికైతే బీఆర్ఎస్(BRS) పార్టీకి ఈసారి భారీ దెబ్బ పడుతుందనే ఉద్దేశంతోనే పార్టీలోని నాయకులందరూ చివరి క్షణాల్లో పార్టీని వీడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.