ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను నాశనం చేసిందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
ఉద్యోగాలు రావాలంటే యువత కాంగ్రెస్ కు ఓటు వేయాలని సూచించారు.తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యంతోనే ప్రజలు కోరుకుంటున్న మార్పు సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.