శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల యాస లో ఓలమ్మో ఓలమ్మో అంటూ చక్కనైన హావ భావాలతో మాట్లాడే ప్రపంచ యాత్రికుడు , యూ ట్యూబర్ అన్వేష్ గురించి అందరికీ తెలిసిందే.యూట్యూబ్ లో అన్వేష్ వీడియోలకు మంచి ఆదరణ ఉంటోంది.
వివిధ దేశాల్లో తిరుగుతూ , అక్కడ సంస్కృతి , ఆయా దేశాల ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు , ఇలా అన్నిటిని చక్కగా వివరిస్తూ అన్వేష్ చేసి వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని వివరాలను స్వయంగా అక్కడికి వెళ్లి వివరిస్తూ అన్వేష్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఆయన వీడియోలు మీడియా, సోషల్ మీడియా( Social media ) లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి.

కొద్ది రోజులు క్రితం అన్వేష్( Anvesh ) చేసిన వీడియో పై వైసీపీ( YCP ) తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.జింబాబ్వే దేశం వెళ్లిన అన్వేష్ అక్కడ పరిస్థితులు ఆదేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏపీతో పోలుస్తూ , ఇక్కడ కూడా అదే పరిస్థితులు రాబోతున్నాయి అంటూ చేసిన వీడియో వైరల్ అయింది. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలు చాలా ప్రమాదకరమని , రాబోయే రోజుల్లో ఏపీ కూడా జింబాబ్వే మాదిరిగా తయారవుతుందని అన్వేష్ ఆ వీడియోలో విమర్శలు చేశారు.
ఎప్పుడూ రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా, ఆయా దేశాలు పరిస్థితులు ప్రజల జీవన విధానం గురించి మాట్లాడే అన్వేష్ మొదటిసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడం పై వైసీపీ శ్రేణులు భగ్గు మంటోంది.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్వేష్ కు ఐదు కోట్లు ఇచ్చారని , అందుకే ఆయన ఏపీ ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నారు.

ఇక అన్వేష్ చేసిన ఈ వీడియో పై తీవ్ర విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే జింబాబ్వేకి ఆంధ్రప్రదేశ్ కి చాలా తేడాలే ఉన్నాయి .ఆదేశ ఆర్థిక పరిస్థితి , మన దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి చాలా తేడా ఉంది.జింబాబ్వే ఒక దేశం ఏపీ ఒక రాష్ట్రం.
ఆర్థిక వ్యవస్థ రాజకీయాలపై సరైన అవగాహన లేకుండా అన్వేష్ మాట్లాడారని ఇప్పటికే అనేకమంది చెబుతున్నారు. ఒక దేశంతో పోలుస్తూ ఒక రాష్ట్రాన్ని లింకు పెట్టి విమర్శలు చేయడం సరికాదని , అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆర్థిక పరమైన విషయాల పైన అంతగా పట్టు లేదని, ఆ వీడియో చూస్తే స్పష్టం అవుతోంది అని కొంతమంది తేల్చి చెబుతున్నారు.
జింబాబ్వే ఆర్థిక పరిస్థితి కుదేలు కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.అక్కడ కరెన్సీ నోట్ల ను ముద్రించే విధానం కూడా ఆదేశ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం.
కానీ ఏపీ పరిస్థితి ఆ విధంగా ఎందుకు ఉంటుంది ? భారత్ లో ఏ రాష్ట్రం అయినా కొన్ని పరిమితుల లోపు రుణాలపై ఆధారపడతాయి.వివిధ రాష్ట్రాలకు రుణాలు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది .ఏపీ కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి.ఇవేమీ ప్రస్తావించకుండా అన్వేష్ ఏకపక్షంగా ప్రాథమిక ఎటువంటి అవగాహన లేకుండా విమర్శలు చేశానని వైసిపి ( YCP )ఆరోపిస్తోంది.
ఆయన అవగాహన ఉండి చేశారా లేదా ప్రలోభాలకు గురై చేశాడా అనేది పక్కన పెడితే , ఆ వీడియో ద్వారా వైసీపీ ప్రభుత్వం కు జరిగిన డ్యామేజ్ మాత్రం తీవ్రంగానే ఉంది.