పల్సర్ బైక్ ఝాన్సీ( Pulsar Bike Jhansi ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పల్సర్ బైకు పాటతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.
పల్సర్ బైకు పాట తర్వాత ఝాన్సీ పెద్ద సెలబ్రిటీ అయిపోయిందని చెప్పవచ్చు.ఒకవైపు డాన్స్ చేస్తూనే మరొకవైపు కండక్టర్గా ఉద్యోగం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఝాన్సీకి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందట.
పూర్తి వివరాల్లోకి వెళితే.సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం( Ukku Satyagraham ).

జనం ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్ గా నటిస్తోంది.గాయకుడు గద్దర్ ( Gaddar )ఇందులో కీలక పాత్ర పోషించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ను విడుదల చేశారు గద్దర్ కుమార్తె వెన్నెల.ఈ సందర్భంగా గద్దర్ కుమార్తె వెన్నెల ( vennela )మాట్లాడుతూ.
మా నాన్నగారైన గద్దర్ గారు ప్రజల కోసం ఎంతో పాటు పడేవారు.ఆయన రాసిన పాటలు కానీ, గేయాలు కానీ అన్ని ప్రజల కోసం, ప్రజల సమస్యల మీదనే ఉండేవి.
కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కోసం ఎంతో సేవ చేశారు.

అలాగే వారి సమస్యలను ఉద్దేశిస్తూ ఎన్నో పాటలను కూడా రాశారు పాడారు.అలాగే ప్రజా సమస్యల పైన పోరాడే చిత్రాలను ఎక్కువగా నటించిన నాన్నగారు ఈ సినిమాలో పాటలు రాయడంతో పాటు నటించారు అని తెలిపింది వెన్నెల.అనంతరం కండక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది ఎక్కువగా విస్తరిస్తోంది.సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది.
అలాగే సినిమాలు కూడా మంచిగానే చెడును గాని తెలిపేందుకు మార్గ దర్శకాలుగా ఉన్నాయి.ఈ సినిమాలో నేను నటించడానికి కారణం జన సమస్యలను పరిష్కరించే ఒక మంచి చిత్రం ఇది మంచి అంశాలతో కూడుకున్న కథ అందువల్లనే చిత్రంలో నటించాలని అనుకున్నాను.
అలాగే నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి గారికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది పల్సర్ బైక్ ఝాన్సీ.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు సంతోషించడంతో పాటు ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం మొత్తానికి లభించింది అన్న మాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.