వన్డే ప్రపంచ కప్( ODI World Cup ) ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియా నిండా రోహిత్, విరాట్, శుభమన్ గిల్ ప్రేమ కథలు పుట్టలుగా వస్తున్నాయి.పెళ్లయిన క్రికెటర్ లకు భార్యల నుంచి వస్తున్న చిన్న చిన్న సిగ్నల్స్ ని కూడా సోషల్ మీడియా బాగా హైలెట్ చేస్తుంది.
ఇక గిల్ విషయానికొస్తే అతడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో చాలా రోజుల నుంచి ప్రేమాయణం కొనసాగింస్తున్నాడని చాలా రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి.ప్రపంచ కప్ పుణ్యాన గిల్ మరియు సారా( Sara Tendulkar, Shubman Gill ) గురించి అనేక వీడియోలు వార్తలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.
అయితే నిజంగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారా లేక అవి పుకార్ల అనే క్లారిటీ మాత్రం ఎవరి సైడ్ నుంచి ఇవ్వడం లేదు.
పైగా విరాట్ కోహ్లీ( Virat Kohli ) ప్రపంచకప్ సెమీఫైనల్ లో సారా మరియు గిల్ గురించి ఆడియన్స్ అరుస్తుంటే ఇంకా గట్టిగా అరవండి అంటూ సిగ్నల్ ఇవ్వడంతో వారి ప్రేమ నిజమే అని అభిమానులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.ఇండియన్ క్రికెటర్స్ లో ప్రస్తుతం గిరి మంచి అందగాడు సారా కూడా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) యొక్క గారాల కుమార్తె మరి వీరి ప్రేమ విషయం మీడియాకు తెలియకుండా ఎలా ఉంటుంది అప్పుడప్పుడు వీరు డేటింగ్ చేస్తూ అలాగే హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో డిన్నర్ లాంచ్ చేస్తూ అనేకసార్లు మీడియాకు పట్టుబడ్డారు.అయితే మధ్యలో వీరికి ఏమైందో ఏమో కానీ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అయ్యిందనే వార్తలు కూడా జోరందుకున్నాయి.
అయితే వీరికి సచిన్ టెండూల్కర్ మధ్యవర్తించడం చేసి మళ్లీ కలిపారు అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.ఈ గ్యాప్ లో సైఫ్ అలీ ఖాన్ కూతురుతో కూడా డేటింగ్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేశారు.కానీ అందులో నిజం లేదు అని తర్వాత తెలిసింది.ప్రపంచ కప్ మొదలవడానికి కొన్ని రోజుల ముందు గిల్ అనారోగ్యం పాలవడంతో గెట్ వెల్ సూన్ అంటూ లవ్ సింబల్ పెట్టి సారా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడంతో మళ్ళీ వీరిద్దరూ ఒకరు ఇష్టపడుతున్నారు అని వీరి మధ్య ప్యాచప్ జరిగిందని అంతా అనుకున్నారు.
ఆ తర్వాత ఇన్స్టాలో కూడా ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు ఫాలో చేయడం మొదలు పెట్టారు.ఇలా సచిన్ ఇద్దరి బంధానికి గట్టి సపోర్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.