నేటి కోహ్లీ సక్సెస్ వెనుక ఇన్ని సవాళ్లా.. అందుకే కింగ్ కోహ్లీ అని ఊరికే అనరు..!

విరాట్ కోహ్లీ( Virat Kohli ) 2023 వరల్డ్ కప్‌లో మిగతా ప్లేయర్ల కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తూ మళ్లీ అభిమానుల చేత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గా పిలిపించుకుంటున్నాడు.సచిన్ వన్డే సెంచరీల రికార్డు తక్కువ మ్యాచుల్లోనే చెరిపేసి నంబర్ వన్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.

 Virat Kohli Success Story , Virat Kohli, World Cup, Sports , Sports News , K-TeluguStop.com

నిన్న ఈవినింగ్ జరిగిన సెమీఫైనల్స్ లో కూడా సెంచరీ బాది కోహ్లీ తన సత్తా చాటాడు.గతంలో కోహ్లీ పని అయిపోయిందని ఎంతో మంది విమర్శలు చేశారు.

ఇక సర్దుకోవడమే అని, అతడు కెప్టెన్ గా కాదు కదా ప్లేయర్ గా కూడా పనికిరాడు అని ఘోరంగా అవమానించారు.ఇప్పుడు ఆ నోర్లే అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.

ప్రశంసలతో సోషల్ మీడియా సైట్లను ఊపేస్తున్నాయి.నిజానికి కోహ్లీ అంత ఈజీగా ఫెడవుట్ అయ్యే ప్లేయర్ కాదు.

మొదటినుంచి క్రికెట్లో నెంబర్ వన్ కావాలనే తపనతో అతను ఉండేవాడు.ఉదయం నాలుగు గంటలకే లేచి స్టేడియానికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తూ తన బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకునేవాడు.

ఎప్పుడూ తనకంటే ఆటలో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్లతోనే ఆడేవాడు.చిన్నవారితో ఆడితే కిక్కేముంటుంది అన్న ధోరణి అతనిలో ఎప్పుడూ కనిపించేది.

ఇండియా ఓడిపోయిన ప్రతిసారి అందులో తాను ఆడి ఉంటే గెలిచేది అని విశ్వాసం వ్యక్తం చేసేవాడు.ఒంటి చేత్తో గెలిపించగల సత్తానుకుందని అతడు నమ్మేవాడు.

అంతేకాదు అదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో నిరూపించాడు.చిన్నతనం నుంచే తనకు గొప్ప క్రికెటర్‌ అవుతానని ఏజ్ విజువలైజేషన్ చేసుకునేవాడు.

Telugu Virat Kohli-Sports News క్రీడలు

తండ్రి ప్రేమ్ కొహ్లీ 1998, మే 13న ఢిల్లీలో రాజ్ కుమార్ శర్మ( Raj Kumar Sharma ) క్రికెట్ కోచింగ్ అకాడమీలో కింగ్ కోహ్లీని జాయిన్ చేయించాడు.అప్పటికి కోహ్లీ వయసు కేవలం 9 ఏళ్ళే.తొలి మ్యాచ్ లో విరాట్ బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింటిలో ఫెయిల్ అయ్యాడు.కానీ ఫీల్డింగ్ లో మాత్రం బాగా రాణించాడు.బౌండరీ లైన్ నుంచి నేరుగా వికెట్లను పడగొట్టగల గురి అతడి సొంతం అని కోచ్ గుర్తించాడు.అంతేకాదు, కోహ్లీ ఫీల్డింగ్ సామర్థ్యం చూసి అబ్బురపడ్డాడు.

ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ ను ఇండియాకి అందించాలని బాగా అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు.

Telugu Virat Kohli-Sports News క్రీడలు

విరాట్ 2006లో కర్ణాటక( Karnataka )తో జరిగిన రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతనికొక గుండె పగిలే అనుభవం ఎదురయింది.తనకు తండ్రిగా మాత్రమే కాక ఒక మంచి మార్గదర్శిగా ఉన్న తండ్రి కన్నుమూశాడు, ఈ పర్సనల్ లాస్ తో కోహ్లీ తల్లడిల్లాడు.రంజీ మ్యాచ్‌లో ముందురోజు 40 నాటౌట్ గా ఉన్న కోహ్లీ నెక్స్ట్ డే మ్యాచ్ పునఃప్రారంభించాల్సి ఉంది.

కానీ తండ్రి చనిపోయాడు.ఏం చేయాలో తెలియలేదు.

కోచ్ కి ఫోన్ చేయగా “ఇదొక మంచి అవకాశం తండ్రి స్థానంలో ఉండి మ్యాచ్ ఆడమని నేనైతే చెప్తాను, తుది నిర్ణయం నీకే వదిలేస్తాను” అని ఫోన్ పెట్టేసాడు.కోహ్లీ తండ్రి మరణాన్ని దిగమింగుకొని మర్నాడు మ్యాచ్ ఆడాడు.

కానీ అతన్ని తప్పుగా అంపైర్ ఔట్‌ చేశాడు.తండ్రి మరణం కంటే ఆ ఔట్ గురించే కోహ్లీ ఎక్కువ ఏడ్చాడు.

ఆ విషయాన్ని కోచ్‌కు చెబుతూ మొదటగా తన బ్యాట్ కి బంతి తగిలిందని ఆ తర్వాతే ప్యాడ్స్ కు తగిలిందని అది తప్పు ఔట్‌ అని చెబుతూ ఏడ్చాడు.కోచ్ అతడిని ఓదార్చాడు.

అయితే ఇది అబ్నార్మల్ అని కొందరు అంటారు కానీ కోహ్లీ తన తండ్రితో సమానంగా క్రికెట్ ను ప్రేమించాడు.సాధారణంగా బాధలో ఉన్నప్పుడు కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది.

ఇది మనసులోని నిరాశ పెంచేసి చాలా డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది.కానీ వ్యాయామం చేస్తే ఈ హార్మోన్ ఉత్పత్తి శరీరంలో తగ్గుతుంది.

ఒత్తిడి కూడా పోతుంది.క్రికెట్ పుణ్యమా అని కోహ్లీ శరీరానికి వ్యాయామం దొరికింది.

దానివల్ల అతడు ఒత్తిడి నుంచి బయటపడ్డాడు.టీనేజ్ వయసులో పార్టీ లంటూ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాడు.

తర్వాత క్రికెట్ పై ప్రేమతో వాటిని వదిలేసాడు.కోహ్లీ చిన్నతనం నుంచి ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ క్రికెట్ ని ఎన్నడూ వదల్లేదు.

అందులో ఫెయిల్ అవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube