యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.ఈయనకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ క్రేజ్ తో విజయ్ స్టార్ హీరోల సరసన చేరాలని తహతహ లాడుతున్నాడు.కానీ వరుస ప్లాప్స్ తో ఫలితం మాత్రం సూన్యం అనే చెప్పాలి.
కానీ ఇటీవలే ఖుషి వంటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇలాంటి సక్సెస్ తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.అందులో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.‘ఫ్యామిలీ స్టార్’ ( Family Star ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.అందులోను విజయ్, పరశురామ్ కాంబో ఇప్పటికే గీతా గోవిందం వంటి ఘన విజయం అందుకుంది.
మరి సూపర్ హిట్ కాంబో కావడంతో ఇప్పుడు కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా గురించి తాజాగా నెట్టింట ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మరి దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి రేసులోనే నిలిపేందుకు మేకర్స్ టైం ఫిక్స్ చేసుకుని సంక్రాంతికే రిలీజ్ అని కూడా ప్రకటించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.
అందుకు కారణం ఈ సినిమా షూట్ అయిపోలేదు అని తెలుస్తుంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షూట్ మొత్తం అయ్యేలా కనిపించడం లేదని సంక్రాంతికి వాయిదా వేసినట్టు టాక్ వస్తుంది.షూటింగ్ డిలే కావడం వల్ల ఈసారి దిల్ రాజు సంక్రాంతి పండుగ టార్గెట్ మిస్ అయినట్టే అని తెలుస్తుంది.చూడాలి మేకర్స్ ఈ రూమర్స్ విషయంలో ఎలా స్పందిస్తారో.