పిల్లల కోసమే పెళ్లి.. వైరల్ అవుతున్న కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కరీనా కపూర్( Kareena Kapoor ) కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.తెలుగులో ఈ బ్యూటీ సినిమాలు చేయకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు కరీనాను అభిమానిస్తారు.

 Kareena Kapoor Sensatioanal Comments Goes Viral In Social Media Details Here ,-TeluguStop.com

పిల్లల కోసమే పెళ్లి అంటూ కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.పిల్లల కోసం మేము పెళ్లి చేసుకున్నామని లేకపోతే డేటింగ్ చేసేవాళ్లమని ఆమె తెలిపారు.

మేము ఐదు సంవత్సరాల పాటు డేటింగ్ చేశామని పిల్లలు కావాలని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నామని కరీనా కపూర్ వెల్లడించారు.పిల్లలు ఉంటే బాధ్యతలు పెరుగుతాయని కరీనా కపూర్ వెల్లడించారు.సూపర్ మామ్ గా దూసుకెళుతున్న కరీనా కపూర్ ఇలాంటి కామెంట్లు చేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బాలీవుడ్ లో పెళ్లై పిల్లలున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చిన హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు.

సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )ను ఎంతో ఇష్టంతో ప్రేమించి కరీనా పెళ్లి చేసుకున్నారు.సైఫ్ కరీనా జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

రాబోయే రోజుల్లో సైఫ్ కరీనా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కరీనా రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.

కరీనా తెలుగు సినిమాలలో సైతం నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.కరీనా కపూర్ వయస్సు 43 సంవత్సరాలు అయినా ఆమె ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.సోషల్ మీడియాలో( Social media ) కరీనా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే మాత్రం మరికొన్ని సంవత్సరాల పాటు ఈ హీరోయిన్ కెరీర్ కు ఢోకా ఉండదని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube