టాలీవుడ్ లోనే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) మరియు రష్మిక మందన్న( Rashmika Mandanna ) జోడి కి మంచి పాపులారిటీ ఉంది.వీరు గీత గోవిందం సినిమాతోనే మొట్టమొదటి సారి జత కట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
ఆ దెబ్బతో రష్మిక అప్పటి వరకు చేసిన కన్నడ సినిమాలను, ఆ ఇండస్ట్రీ ని వదిలేసి తెలుగులోనే సెటిల్ అయ్యింది.ఆ క్రమం లోనే కన్నడ సినిమాల్లో పరిచయం అయినా రక్షిత్ శెట్టి తో( Rakshit Shetty ) ప్రేమలో పడి, నిశ్చితార్థం కూడా చేసుకొని తెలుగు సినిమాల్లో క్రేజ్ రావడం తో అతడికి కూడా బ్రేకప్ చెప్పి శాశ్వతంగా అక్కడి వారికి దూరం అయ్యింది.
అప్పటి నుంచి విజయ్ దేవరకొండ తో డీప్ లవ్ లో ఉంది అనే వార్తలు ఫుల్ జోరందుకున్నాయి.అందరి అనుమానాలకు ఊతం ఇస్తూ ఈ జోడి ఎక్కడ చుసిన చెట్టాపట్టాల్ వేసుకొని కలిసి తిరుగుతూ ఫోటోలకు పోజులు ఇస్తుంది.
కానీ ఎక్కడ కూడా తాము లవ్ లో ఉన్నామని కానీ రిలేషన్ లో ఉన్నామని కానీ బయటకు మాత్రం చెప్పడం లేదు.పైగా ప్రతి పండగ కి రష్మిక( Rashmika ) ఎక్కడ ఉన్న కానీ ఆ రోజు మాత్రం విజయ్ దేవరకొండ ఇంట్లో ఉంటుంది.కానీ గ్రూప్ ఫొటోస్ లో కలిసి కనిపించరు.ఎవరికీ వారు పిక్స్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.వెకేషన్ కి వెళ్లిన కూడా ఇదే తరహా వేరు వేరుగా పిక్స్ పెడుతూ హల్చల్ చేస్తున్నారు.ఇక ఈ దివాళి పండగకు( Diwali Festival ) సైతం రష్మిక విజయ్ కుటుంబం తోనే సెలబ్రేట్ చేసుకుంది.
వీరి ఇద్దరి వ్యవహారం అటు రష్మిక ఇంట్లోనూ అలాగే విజయ్ ఇంట్లోనూ ఓపెన్ గానే తెలుసు.కానీ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు అలాగే ఇరువైపుల పెద్దలు ఒప్పుకున్నారో లేదో కూడా తెలియదు.
కానీ ప్రస్తుతం ఇద్దరు మాత్రం వారి లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.అలాగే వీరి మధ్య ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే అందరికి ఓపెన్ గా తెలిసిన విషయమే.రష్మిక ఎడాపెడా సినిమాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది కానీ విజయ్ చాల గ్యాప్ తీసుకుంటున్నాడు సినిమాలకు.పైగా ఎంత రెమ్యునరేషన్ వచ్చిన అది అతడి స్థాయి కి తగినట్టు రావడం లేదు.అందుకే రష్మిక విజయ్ ఇల్లు కొన్నప్పుడు సహాయం చేసింది అని అంత అనుకుంటారు.
ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే వీరి బంధాన్ని ఎంకరేజ్ చేస్తున్న ఇరు వైపులా పెద్దలు రేపు పెళ్లి కూడా చేస్తారా అనేది పెద్ద సందేహం.విజయ్ చాల చిల్ టైపు.
కానీ రష్మిక కొంచం ఎమోషనల్ టైపు.వీరికి పెద్దలు వివాహం చేసేంత సీన్ లేదు అనేది కొంత మంది వాదన.