టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య( Naga Chaitanya ) వరుసగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తుంటే మరి కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు.ఈ మధ్య కాలంలో నాగచైతన్యకు వరుస షాకులు తగలగా నాగచైతన్యకు తన సినిమాలలో నచ్చని సినిమా ఇదేనంటూ ఆయన స్వయంగా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏ మాయచేశావె, 100% లవ్, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ సినిమాలు తాను హీరోగా నటించిన సినిమాలలో నచ్చిన సినిమాలని చెప్పిన నాగచైతన్య బెజవాడ సినిమా( Bezawada Movie ) మాత్రం నచ్చదని చెప్పారు.చైతన్య సినీ కెరీర్ లోని డిజాస్టర్ సినిమాలలో బెజవాడ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా నాగచైతన్యకు చిరాకు తెప్పించిందని అందుకే ఈ సినిమా గురించి ఇలా చెప్పాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్( Dhootha Web Series ) త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.విక్రమ్ కె కుమార్( Vikram K Kumar ) డైరెక్షన్ లో 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.నాగచైతన్యకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చైతన్య నటిస్తే బాగుంటుందని మరి కొందరు ఫీలవుతున్నారు.
చైతన్య కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడనున్నాయి.సమంత ఏదైనా చేయాలని అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేస్తుందని సమంతకు( Samantha ) విల్ పవర్ ఎక్కువని ఆమె హార్డ్ వర్కర్ అని చైతన్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నాగచైతన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
చైతన్య రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.