వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి( Varun Tej, Lavanya Tripathi ) పెళ్లి గ్రాండ్ గా జరగగా రిసెప్షన్ సైతం అంగరంగ వైభవంగా జరగడం గమనార్హం.ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకకు కొంతమంది సినీ ప్రముఖులు హాజరు కాగా చాలామంది స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఈ వేడుకకు హాజరు కాలేదు.
అయితే ఎక్కువమంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలకు సంబంధించి వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి.కొంతమంది సెలబ్రిటీలు హైదరాబాద్ లో లేరని సమాచారం అందుతోంది.
మరి కొందరు సెలబ్రిటీలు సండే కావడం వల్ల వేర్వేరు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం అందుతోంది.ఎన్ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగగా నందమూరి హీరోలతో పాటు కొంతమంది సీనియర్ స్టార్స్ ( Senior Stars )సైతం ఈ వేడుకకు దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాకపోయినా డైరెక్ట్ గా కలిసి త్వరలో ఈ జంటను ఆశీర్వదించనున్నారని సమాచారం అందుతోంది.సినీ ప్రముఖులు నాగబాబు ఫ్యామిలీ వేడుకను లైట్ తీసుకోవడానికి కారణమేంటనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరికే అవకాశాలు అయితే ఉంటాయి.వరుణ్ తేజ్ మరికొన్ని వారాల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది.వరుణ్ తేజ్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఆపరేషన్ వాలంటైన్, మట్కా( Operation Valentine, Matka ) సినిమాలలో నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాలు వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
వరుణ్ తేజ్ లావణ్య జోడీ బ్యూటిఫుల్ జోడీ అని ఈ కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రావాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.