ప్రస్తుత రోజులలో యువకుల నుంచి పెద్దవారి వరకు హార్ట్ ఎటాక్( Heart Attack ) భారిన పడుతూ ఉన్నారు.ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డబ్బుల కోసం ఓవర్ టైం వర్క్ చేయొద్దని కూడా చెబుతున్నారు.ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.
ఆర్ నారాయణ మూర్తి( N.R.Narayana Murty ) షాకింగ్ కామెంట్స్ చేశారు.అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశన్ని నిలబెట్టాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాల్సిందేనని చెప్పారు.
ఈ అభిప్రాయం పై భారీ ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన ఒక కార్డియాలజిస్ట్ నారాయణమూర్తి సూచించిన పని గంటల ను తప్పు పట్టారు.
వారానికి 70 గంటల వరకు వల్ల కలిగే దుష్ప్రభావాలను వెల్లడించారు.ఇలాంటి జీవన శైలి వల్ల ఎక్కువమంది యువత గుండె సమస్యలతో బాధపడే అవకాశం ఉంది అని చెబుతున్నారు.బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి( Dr.Deepak Krishnamurthy ) ఈ అంశం పై గతంలో తన సొంత అభిప్రాయాలను వెల్లడించారు.ఇలా ఎక్కువ గంటలు పని చేయడం వల్ల మనిషి ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.ఒత్తిడి, శరీరక శ్రమ లేకపోవడం వల్ల ఇప్పటికే చాలామంది యువత గుండెపోటుకు గురవుతున్నారని ఆయన వెల్లడించారు.
ఇలా పని చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు పని చేయడం వల్ల జీవితంలోని ఇతర అంశాలకు చాలా తక్కువ సమయం ఉంటుంది.
నారాయణమూర్తి చెప్పినట్లు వర్క్ చేస్తే రోజులోని 24 గంటల్లో ఉద్యోగులకు పని తర్వాత 12 గంటలు మాత్రమే మిగిలి ఉంటుందని చెబుతున్నారు.ఆ 12 గంటల్లో 8 గంటలు నిద్ర అవసరం( 8 Hours Sleep ) అవుతుందని చెబుతున్నారు.ఇలా చూసుకుంటే ఇతర ముఖ్యమైన పనులకు నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉంటుందని చెబుతున్నారు.ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న బెంగళూరు( Bangalore ) లాంటి నగరలలో ఉద్యోగులు రోజు రెండు గంటల పాటు రోడ్డుపైనే గడుపుతారని వెల్లడించారు.
ఆ రెండు గంటలు పోను వ్యక్తిగత పరిశుభ్రత, భోజనం, ప్రాథమిక పనులకు కేవలం రెండు గంటలు మాత్రమే సమయం మిగులుతుందని స్పష్టం చేశారు.దీని వల్ల సోషలైజింగ్, ఫ్యామిలీ ఇంట్రాక్షన్స్, వ్యాయామం లేదా విశ్రాంతి తీసుకోవడానికి నిమిషం కూడా సమయం ఉండదని స్పష్టంగా వెల్లడించారు.
చాలా కంపెనీలు ఉద్యోగులు పని గంటల తర్వాత కూడా ఈమెయిల్స్, కాల్స్ కు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నట్లు కూడా చెప్పారు.