శ్రీలంక రోడ్లపై టోల్ కలెక్టర్‌గా మారిన ఏనుగు.. ఏం చేస్తుందో తెలిస్తే..

శ్రీలంకలో( Srilanka ) బుట్టల-కటరగామ రహదారి మీద ఒక ప్రత్యేకమైన “టోల్ కలెక్టర్” వెలిశాడు.ఆ కలెక్టర్ అటువైపు వచ్చే వాహనాలను ఆపేసి టోల్ తీసుకుంటున్నాడు.

 Wild Elephant In Sri Lanka Collecting Road Tax Video Viral Details, Sri Lanka, E-TeluguStop.com

ఇందులో వింత ఏముంది అనుకునేరు.నిజానికి కలెక్ట్ చేసేది మనిషి కాదు, రాజా( Raja ) అనే భారీ ఏనుగు! అదేంటి, ఏనుగు( Elephant ) టోల్ కలెక్ట్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ, అయితే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

40 ఏళ్లకు పైగా వయసున్న ఈ ఏనుగు, ప్రతిరోజు వాహనాలను ఆపి, తిను బండారాలు ఏవైనా ఇవ్వాలని డ్రైవర్లను ప్యాసింజర్లను అడుగుతూ ఉంటుంది.కోపం రాకుండా, తన ముక్కుతో వాహనదారులను సిగ్నల్ ఇస్తుంది.

చాలామంది డ్రైవర్లు ఏదైనా ఫ్రూట్( Fruits ) ఇచ్చేసి ముందుకు వెళ్లిపోతారు.ఇప్పుడు ఈ రోడ్డు మీద ఇది ఒక రకమైన రొటీన్ అయిపోయింది.

ఈ రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్మే స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి.డ్రైవర్లు ఏనుగులను కలవడానికి ముందుగానే అక్కడ ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తారు.

లనుగమువెహెర నుండి సెల్లా కటారగమ వరకు రోడ్డు మీద 100 కి పైగా ఫ్రూట్స్ స్టాల్స్ ఉన్నాయి.ప్రతిరోజు సగటున 500 మంది డ్రైవర్లు ఏనుగును దాటి వెళ్లాల్సి వస్తుంది.వారందరూ కూడా దానికి ఏదో ఒక పండు లేదా పండ్లు కొనిస్తారు.ఈ రోడ్డు గుండా వెళితే అడవి అంతా కనిపిస్తుంది.అందుకే ఈ రోడ్డు మీదకి అడ్వెంచర్ కోసం చాలామంది వస్తారు.ఇప్పుడు ఈ రోడ్డు మీద ఏనుగు ఉండటం వల్ల ఇంకా ఫేమస్ అయిపోయింది.

రాజా ఏనుగు( Elephant Raja ) వాహనదారుల నుంచి పండ్ల రూపంలో టోల్ కలెక్ట్ చేస్తున్నట్టు చూపించే ఒక వీడియో వైరల్( Viral Video ) గాను మారింది.కొంతమంది ఈ ఏనుగును “బిజినెస్ మ్యాన్” అని కూడా అంటున్నారు.ఎందుకంటే రాజా చాలా కూల్ గా, వాహనదారులను ఆపుతూ ఉంటుంది.“మీరు ఇక్కడి నుంచి వెళ్లాలంటే నాకు ఏదో ఒక పండు ఇవ్వాల్సిందే” అన్నట్లు సైగ చేస్తుంది.దాని బిజినెస్ స్ట్రాటజీ గురించి తెలుసుకొని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.శ్రీలంక కల్చర్ లో ఏనుగులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.బుద్ధుడు తన గత జన్మలో ఏనుగుగా జీవితాన్ని కొనసాగించాలని వారు విశ్వసిస్తారు.ఇక మన భారతదేశంలో కూడా ఏనుగు కి చాలా ప్రత్యేకత ఉంది.

ఏనుగు ముఖం అతికించుకున్న లార్డ్ గణేశాను ఎంత బాగా పూజిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube