మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.గత కొంతకాలంగా మంచు కుటుంబంలో ఆస్తి విభేదాలు చోటుచేసుకున్నాయనీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక మంచు మనోజ్( Manchu Manoj ) పెళ్లి జరిగిన తర్వాత ఏకంగా విష్ణు( Manchu Vishnu ) తనపై దాడి చేశారు అంటూ అప్పట్లో ఒక వీడియో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.అయితే ఈ వీడియోని ఒక షార్ట్ ఫిలిం లాగా చేస్తున్నాము అంటూ మంచు విష్ణు కవర్ చేసే ప్రయత్నాలు చేసినా కూడా వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని అందుకే ఇలా బహిరంగంగా కొట్టుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి.

తాజాగా మరోసారి ఈ కుటుంబంలో చోటు చేసుకున్న ఆస్తి తగాదాలు బయటపడ్డాయి మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తనను తండ్రి కొట్టాడని పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడట.మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు( Mohan Babu ) ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరిగాయట.ఈ దాడిలో భాగంగా మంచు మనోజ్ గాయాలు పాలు కావడంతో ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఈ కుటుంబంలో విభేదాలు చోటుచేసుకున్నాయి అంటూ వార్తలు వస్తున్న తరుణంలో మోహన్ బాబు పి ఆర్ టీం స్పందించారు.మోహన్ బాబు దాడి చేయడంతో మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఖండించారు.ఆస్తి విషయంలో వీరి మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేదని సోషల్ మీడియాలో వీరి గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం అంటూ ఈ వార్తలను ఖండించారు.దీంతో మంచి కుటుంబంలో ఆస్తి తగాదాలు గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ఇకపోతే గత కొద్దిరోజులుగా మంచు విష్ణు మనోజ్ మధ్య పరస్పర భేదాభిప్రాయాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.