పుష్ప.పుష్ప.పుష్ప.ప్రస్తుతం ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తుందనడుములో ఎటువంటి అతిశక్తి లేదు.ఇక సినీ అభిమానులైతే పుష్ప సినిమాలోని డైలాగులతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా.
ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకని భారీ వసూళ్లను కొల్లగొడుతోంది.దింతో బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ రికార్డులు అయినా సరే.పుష్ప 2 కలెక్షన్ల ముందు చిన్నబోయాయి.

ప్రముఖ నగరాలలో డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 9 గంటల సమయంలో ప్రీమియర్ షో లతో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకువెళ్తోంది.మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా 294 కోట్లు కొల్లగొట్టగా అవి మూడో రోజుకి ఏకంగా 640 కోట్ల వసూళ్లతో కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు.మొట్టమొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే కేవలం మూడు రోజుల్లో 640 కోట్ల వసూళ్లను రాబట్టింది పుష్ప 2.ఫాస్టెస్ట్ 500 కోట్ల వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్( Allu Arjun ) మూడు రోజుల్లోనే రికార్డు సృష్టించాడు.

బాలీవుడ్ లో కూడా లేని ఈ రికార్డు ఇప్పుడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ సాధించాడు.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shahrukh Khan ) సినిమా జవాన్( Jawan Movie ) మొదటిరోజు 65 కోట్లు సాధించి రికార్డు సృష్టించగా.దానిని పుష్ప 72 కోట్లు వసూలు చేసి రికార్డు బద్దలు కొట్టాడు.
రెండో రోజు 59 కోట్లు వసూలు చేయగా, మూడవరోజు 74 కోట్లతో మొదటి రోజు కలెక్షన్లను దాటి మరి వసూళ్లను రాబట్టారు.ప్రస్తుతం భారతదేశ సినీ చరిత్రలోనే ఉన్న రికార్డులన్నీ అల్లు అర్జున్ కొల్లగొడుతున్నాడు.
ఇదే కొనసాగితే మరో నాలుగు, ఐదు రోజుల్లో 1000 కోట్లు దాటేస్తుంది కూడా.