ఇంగ్లాండ్‌లోని లాంకెస్టర్‌కు( Lancaster, England ) చెందిన 17 ఏళ్ల కేలన్ మెక్‌డొనాల్డ్ ( Kaylan MacDonald )అనే అబ్బాయి స్టిక్కర్ల వ్యాపారంతో నెలకు దాదాపు రూ.16 లక్షలు సంపాదిస్తున్నాడు.రెండేళ్ల క్రితం క్రిస్మస్‌కు తన తల్లి కరెన్ న్యూషామ్ కొనిచ్చిన క్రికట్ జాయ్ మెషిన్‌తో ఈ వ్యాపారం మొదలైంది.191 (సుమారు రూ.16,000) డాలర్లు ఖరీదు చేసే ఆ డిజిటల్ మెషిన్ డిజైన్లను ప్రింట్ చేసి, కట్ చేసి, డ్రా చేస్తుంది.ఆ యంత్రంతో అతను గ్లాసులు, యాక్రిలిక్ వస్తువులపై అందమైన స్టిక్కర్ డిజైన్లు వేసి అమ్మడం ప్రారంభించాడు.
తన ఫేస్‌బుక్‌లో ఈ డిజైన్ల ఫొటోలు పెట్టగానే చాలామంది అతనిని సంప్రదించి గ్లాసులు, మగ్స్, కీ చైన్స్, టీ షర్ట్స్ లాంటి వాటిపై స్పెషల్ డిజైన్లు చేసేవమని అడిగారు.ఈ విధంగా చిన్న వయసులోనే కేలన్ మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు.
2024 మొదటి నెలల్లో కేలన్ నెలకు సుమారు 200 పర్సనలైజ్డ్ వస్తువులు అమ్ముతుండేవాడు.కాలేజీ తర్వాత రోజుకు మూడు గంటలు పని చేస్తూ ఈ వ్యాపారాన్ని చూసుకునేవాడు.కొంతకాలానికి కాలేజీ వదిలేసి ఈ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి సారించాడు.తన వ్యాపారాన్ని పెంచడానికి పెద్ద ప్రింటింగ్ మెషీన్లు కొన్నాడు.జులై నుంచి కేలన్ టిక్‌టాక్ షాప్( Kelan Tiktok Shop) వంటి వెబ్‌సైట్ల ద్వారా దాదాపు రూ.79 లక్షల విలువైన వస్తువులు అమ్మాడు.
ఈ వ్యాపారం తన జీవితాన్ని మార్చేసిందని కేలన్ చెప్పాడు.“ఇది నేను పొందిన అత్యుత్తమ క్రిస్మస్ గిఫ్ట్.ఇంత పెద్దగా ఎదగుతుందని నేను ఊహించలేదు” అని అతను పంచుకున్నాడు.కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి అతను ఇప్పుడు వారానికి ఆరు రోజులు, రోజుకు 16 గంటలు పని చేస్తున్నాడు.
ఈ క్రిస్మస్‌లో అతని అత్యంత ప్రాచుర్యం పొందిన ఉత్పత్తి పేరుతో చేసిన యాంజెల్ వింగ్స్‌తో కూడిన బాబుల్, గత సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తి స్నో గ్లోబ్ టంబ్లర్లు.కేలన్ తన వ్యాపారం త్వరలో రూ.1 కోటి అమ్మకాలను దాటిపోతుందని నమ్ముతున్నాడు.ఓ చిన్న గిఫ్ట్, క్రియేటివ్ ఐడియా ఉంటే చాలు పెద్ద విజయం సాధించవచ్చు అని ఈ కుర్రాడు నిరూపించాడు.