తాజాగా మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) భోపాల్‌లో జరిగిన ఓ ఘటన ప్రజలందరినీ కలచివేసింది.ఈ ఘటనలో ఒక వ్యక్తి తన కూతురిని స్కూల్‌కు తీసుకెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి.
అతడు వాటి దాడి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించగా, ఆ కుక్కల యజమానులు అతనిపైనే దాడి చేశారు.ఈ ఘటన సీసీ కెమెరాలో(CCTV camera) రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గోవింద్‌పురా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన ఈ ఘటనను ‘ఘర్ కే కలేష్’(Ghar ke Kalesh’) అనే సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.ఈ వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి తన కూతురిని స్కూల్‌కు తీసుకెళ్తుండగా కొన్ని కుక్కలు (Dogs)వారిని వెంబడించడం స్పష్టంగా కనిపిస్తోంది.
తననూ, తన కూతుర్నీ కాపాడుకోవడానికి ఆ వ్యక్తి తన హోండా స్కూటర్ ఆపి కుక్కలపై రాళ్లు వేశాడు.ఇది చూసిన యజమానులు “మా కుక్కలకే రాళ్లు వేస్తావా” అంటూ అతడి పై పంచుల వర్షం కురిపించారు.
తన్నుతూ, పంచులు విసురుతూ, నేల పైన పడేసి లాగుతూ దారుణంగా హింసించారు.ఆ వ్యక్తి కూతురు వారిని ఆపమని వేడుకున్నా, బిగ్గరగా ఏడ్చినా ఓనర్లు పట్టించుకోలేదు.దాంతో పాటు, ఆ కుక్కలు కూడా ఆ వ్యక్తిని వదలకుండా వేధించాయి.

ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ, ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో పెంపుడు జంతువుల యజమానులు తమ జంతువులను బాధ్యతాయుతంగా చూసుకోవాలని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.చాలామంది కుక్కల యజమానులను తిట్టిపోస్తున్నారు.“బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. కుక్కల యజమానులే (Dog owners)తప్పు చేశారు” అని ఒకరు కామెంట్ చేశారు.

మరొకరు, “పెంపుడు జంతువుల యజమానులు తమ జంతువులను కంట్రోల్ లో పెట్టుకోవాలి.కుక్కలు ఆ వ్యక్తిని కరిచినట్లయితే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రశ్నించారు.ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







