ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social media )ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఆ క్లిప్ లో కనిపించినట్లు, ఒక పెద్ద అనకొండ పాము(anaconda, snake) ఒక మనిషి పక్కనే పడుకుంది.
అంతేకాదు, అదే పడక మీద ఒక కుక్క కూడా చాలా హాయిగా పడుకుంది! ఈ వింత దృశ్యం చూసిన వాళ్ళు అంతా షాక్ అయిపోయారు.అమెరికాలో ఉండే మైక్ హోల్స్టన్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు.
ఈయనకు పాములంటే చాలా ఇష్టం.తరచూ పాములతో కలిసి తీసిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు.
అయితే తాజా వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో వైరల్ అయింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో మైక్ హోల్స్టన్(Mike Holston) భారీ అనకొండ పక్కనే చాలా హాయిగా పడుకుని పుస్తకాన్ని చదువుతున్నాడు.
పాము పుస్తకంలో బొమ్మలు చూస్తున్నట్లుగా ఉంది.ఆయన పక్కనే ఉన్న కుక్క (dog)తమ బెడ్ పై ఒక పెద్ద పాము ఉందనే విషయం పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్రపోతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు హోల్స్టన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.మరొకరు ఇలాంటి స్టంట్స్ చేయడం చాలా ప్రమాదకరం అని అన్నారు.
కొందరు ఆ కుక్క చాలా తెలివిగా ఉందని, ఆ పాము దగ్గరకు వెళ్లకుండా సురక్షితమైన దూరంలో కునుకుతీస్తోందని కామెంట్లు చేశారు.మరికొందరు ఈ సన్నివేశాన్ని తమ జీవితానికి పోల్చి చూసుకున్నారు.ఉదాహరణకు, “నేను, నా ఎక్స్ ఇలాగే మంచం మీద పడుకునే వాళ్లం” అని ఒకరు కామెంట్ చేశారు.“ఓ మై గాడ్, ఇతనికి పాములు అంటే భయం లేదా?” అని ఇంకొందరు సందేహం వ్యక్తం చేశారు.
కొందరు ఆ అనకొండ మనిషిని, కుక్కను తినడానికి సిద్ధంగా ఉందని కామెంట్లు చేశారు.ఒకరు ఆ కుక్క కళ్ళు తెరిచి నిద్రపోతోందని, అంటే అది ఎప్పుడు లేచి పారిపోవాలా అని చూస్తోందని హిలేరియస్ జోక్స్ చేశారు.ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి ఈ అనకొండ వీడియోలు పోస్ట్ చేశాడు.దానిని రాణి లాగా చూసుకుంటున్నట్లు తెలిపాడు.అతను లేటెస్ట్ గా షేర్ చేసిన వీడియోకి 14 కోట్ల వ్యూస్ వచ్చాయి.అయితే పాములు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో వాటికి తెలియదు కాబట్టి ఇతను వీటికి దూరంగా ఉండటమే మంచిదని చాలామంది సలహా ఇస్తున్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.