తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8( Bigg Boss Telugu 8 ) చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.ఇటీవల గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ షో మరి కొద్ది రోజుల్లోనే ఫినాలే ఎపిసోడ్ ను జరుపుకోనుంది.
మరో వారంలో ఈ షో ముగియనుంది.ఇక వచ్చేవారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది.
ఇందుకు టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు.దాంతో ముందు వారం నుంచి అనుకున్న విధంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరి అయిపోయింది.
ఇందులో భాగంగా తాజాగా శనివారం నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్, నటి రోహిణీని( Rohini ) హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు.టాప్ 5 లో కచ్చితంగా ఉంటుంది అనుకున్న రోహిణీ ఊహించని విదంగా అనూహ్యంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది.

అయితే ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ తన ఆట, మాట తీరుతో అందరి మన్ననలు గెల్చుకుంది రోహిణి.అంతేకాకుండా కళ్లు చెదిరే రెమ్యునరేషన్( Rohini Remuneration ) కూడా అందుకుంది.గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణీ ఈ సారి ఎనిమిదో సీజన్ లో వైల్డ్ కార్డ్ తో( Wild Card ) ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది.
ఒక వైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫిజికల్ టాస్కుల్లో కూడా సత్తా చాటింది.ఓటింగ్ లో కూడా సత్తాను చాటుకుంది.అయితే టాప్ 5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇకపోతే బిగ్ బాస్ 8వ సీజన్ లో రోహిణి దాదాపుగా 9 వారాల పాటు ఉంది.కాగా హౌసు లోకి వచ్చేముందే వారానికి రూ.2లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ లెక్కన ఆమె సుమారు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.ఆమె పారితోషికం గురించి తెలిసి అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు.వామ్మో ఏకంగా అన్ని లక్ష్మలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.