పొట్టేలు మెడకు ఆర్పీ ఫోటోతో బలి.. నంద్యాలలో ఆర్పీకి జలక్ ఇచ్చిన బన్నీ ఫ్యాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నంద్యాల( Nandyala ) పర్యటనకు వెళ్లిన తర్వాత అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ఎంతో మంది కూటమి నేతలు అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు.ఇలా అల్లు అర్జున్ పై విమర్శలు చేసిన వారిలో జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ( Kirak RP ) ఒకరు.

 Allu Arjun Fans Mass Warning To Kirak Rp Details, Allu Arjun, Kirak Rp, Bunny Fa-TeluguStop.com

ఈయన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆర్పీ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Allu Fans, Bunny Fans, Jabardasth, Kiraakrp,

ముఖ్యంగా అల్లు అర్జున్ ఆర్మీ అంటూ మాట్లాడుతున్నారు.తనకు ఆర్మీ ఎక్కడ ఉంది తనకు ఉన్నదంతా మెగా అభిమానులు మాత్రమేనని మెగా ఫాన్స్ లేకపోతే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎవడు అంటూ ఈయన గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా ఈ సినిమాకు వైసీపీ అభిమానుల మద్దతు పూర్తి స్థాయిలో ఉందని చెప్పాలి.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Allu Fans, Bunny Fans, Jabardasth, Kiraakrp,

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నంద్యాలలోనే ఓ థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు పొట్టేలు నరికి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.ఇక పొట్టేలుకు ఏకంగా ఆర్పీ ఫోటోని తగిలించు మరి బలి ఇచ్చారు.దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అయితే ఇప్పటివరకు ఆర్పీ ఈ ఘటన గురించి ఎక్కడా స్పందించలేదు.మరి ఈ ఘటనపై ఆర్పీ స్పందన ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

ఇక జబర్దస్త్ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఆర్పీ ఇలా కూటమికి మద్దతు తెలియజేస్తూ తరచూ వైసీపీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube