టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ,( Director Bobby ) అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా డాకు మహారాజ్.( Daku Maharaj ) ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.
జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.బాలయ్య పాత్రను, రవితేజ( Raviteja ) తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట.
అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందట.ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నాడని టాక్.
పైగా రవితేజ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్.కాగా ఇటీవల ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాను బాలయ్య బాబు అభిమానులు అందరూ మెచ్చుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారట డైరెక్టర్ బాబీ.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్( Bobby Deol ) మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తిరిగి లేకుండా గడుపుతున్నారు.ఇక బాలయ్య బాబు గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య బాబు.ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి.
దాంతో బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి అభిమానులు పోటీ పడుతున్నారు.