తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈయన రాజకీయ, సినీ, అలాగే వ్యాపార రంగానికి చెందిన వారి జాతకాల గురించి చెబుతూ ఉంటారు.
ఎప్పటికప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ లేనిపోటు వివాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు.అయితే ఇప్పటికే చాలా కేసుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే.
పోలీసు కేసులు కూడా నమోదు కావడం జరిగింది.కాగా రీసెంట్ గా వేణు స్వామి మొన్న విడుదలైన పుష్ప 2( Pushpa 2 ) గురించి మాట్లాడుతూ.

పుష్ప 2 సినిమా చూసాను.అల్లు అర్జున్ గారు( Allu Arjun ) సూపర్ గా చేసారు.ముఖ్యంగా రాజా మాతంగి గెటప్ లో బ్లు కలర్ శారీలో జాతర సీన్ ఇరగదీశారు.2016 నుంచి అల్లు అర్జున్ గారి జాతకాన్ని కొన్ని ఛానల్స్ లో విశ్లేషించి చెప్పాను.వాటిల్లో అసలైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్,మాత్రమే, వచ్చే పది సంవత్సరాల దాకా అలాగే కొనసాగుతాడు.అల్లు అర్జున్ తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్, బయ్యర్లు నష్ట పోరు.
ఏ సినిమా చేసినా కూడా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ వీడియోల్ని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

వేణు స్వామి విషయానికి వస్తే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల విషయంలో లేనిపోని వాక్యలు చేసి లేనిపోని తలనొప్పులను తెచ్చుకున్నారు.సినిమాల రివ్యూల విషయంలో సినిమాల ఫలితాల విషయంలో, సెలబ్రిటీల పెళ్లి విషయంలో విడాకుల విషయంలో ఎప్పటికప్పుడు సంచలన వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి.ముఖ్యంగా సమంత పెళ్లి విడాకుల సమయం నుంచి వేణు స్వామి బాగా వైరల్ అయ్యారు.