తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని మన హీరోలు సూపర్ సక్సెస్లను సాధిస్తున్నారు.వాళ్లకంటు ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తూ సినిమాలను చేయడమే కాకుండా ప్రయోగాల వైపు కూడా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు తార స్థాయిలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళ పరిధిని పెంచుకోవడంలో పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఆయన నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఫీదా అవుతున్నాడనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబరచాడు అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.మరి ఆయన ఖాతాలో మరొక నేషనల్ అవార్డు వస్తుందా అనే రీతిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఫాహాద్ ఫజిల్( Fahadh Faasil ) లాంటి గొప్ప నటుడి ని తీసుకొచ్చి ఇందులో కమెడియన్ గా మార్చారు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన క్యారెక్టర్ లో విలనిజం అనేది పెద్దగా కనిపించలేదు.

ఇక పుష్ప పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ చేశారో అలాంటి క్రూరమైన ఫాహాద్ ఫజిల్ అయితే ఈ సినిమాలో కనిపించలేదు.ఆయనలో ఉన్న కసి ఈ సినిమాలో మనకు ఎక్కడ తారస పడదు.మరి ఎందుకు ఇలాంటి ఒక వైఖరిని పాటించారు అనే ధోరణిలో కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఫాహాద్ ఫజిల్ విలనిజాన్ని పండిస్తే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వదనే ఉద్దేశంతోనే ఆయన క్యారెక్టర్ ని తగ్గించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…