ప్రముఖ అమెరికా విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ క్రిస్మస్ సీజన్‌లో ( Christmas)పిల్లలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఈ సంస్థ “ఫాంటసీ ఫ్లైట్స్” అని పిలిచే ప్రత్యేక విమానాలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ విమానాలలో ప్రయాణించే పిల్లలు శాంటాక్లాజ్‌ని కలుసుకోవడానికి “నార్త్ పోల్”కు వెళ్లే అవకాశం పొందుతారు.ఫాంటసీ ఫ్లైట్స్ లో పిల్లలు పూర్తిగా ఉచితంగా ప్రయాణించగలుగుతారు.
ఈ ప్రత్యేక విమానాలు లాస్ ఏంజిల్స్, లండన్, టోక్యో(Los Angeles, London, Tokyo) వంటి 13 నగరాల నుంచి బయలుదేరుతున్నాయి.ఈ ఫ్లైట్లలో మొదటిది డిసెంబర్ 7న హొనోలులు నుంచి బయలుదేరింది.
ఈ విమానంలో ప్రయాణించిన పిల్లలు(Childewn), వారి కుటుంబ సభ్యుల ముఖాలపై ఆనందం నిండిపోయింది.విమానం ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ “శాంటాక్లాజ్ మనల్ని క్రిస్మస్ దీవికి ఆహ్వానించారు, అతని ఎల్ఫ్‌లు మన కోసం అక్కడ ఎదురుచూస్తున్నారు.” అని అనౌన్స్ చేసి చాలామందిలో ఉత్సాహాన్ని నింపారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు, యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకే ఈ ప్రత్యేక విమాన ప్రయాణం అందుబాటులో ఉంటుంది.
బాగా కష్టపడే పిల్లల జీవితంలో ఈ ఫ్లైట్ జర్నీ ద్వారా సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు.ఈ విమానం ఎక్కువ దూరం ప్రయాణించదు.కొద్దిసేపు ఎగిరి మళ్లీ అదే విమానాశ్రయానికి(airport) వస్తుంది.కానీ విమానం దిగిన తర్వాతే నిజమైన మ్యాజిక్ ప్రారంభమవుతుంది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు కలిసి విమానాశ్రయాన్ని ఒక అద్భుతమైన శీతాకాలపు దేశంగా మార్చారు.
విమానాశ్రయం మొత్తం మెరిసే దీపాలతో, అలంకరించబడిన క్రిస్మస్ చెట్లతో నిండిపోయి ఉంటుంది.అంతేకాదు, శాంటాక్లాజ్(Santa Claus), అతని ఎల్ఫ్‌లు కూడా అక్కడ ఉంటాయి.పిల్లలు విమానం నుంచి దిగగానే ఈ అద్భుత దృశ్యం వారిని ఆశ్చర్యపరుస్తుంది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్(United Airlines Human Resources Executive) వైస్ ప్రెసిడెంట్ కేట్ గెబో మాట్లాడుతూ, “మా సంస్థ పిల్లలు, కుటుంబాలకు ఆనందాన్ని అందించడంపై గర్వపడుతుంది.ఈ ఏడాది మేం మరింత ఎక్కువ నగరాల నుండి విమానాలు నిర్వహించడానికి సిద్ధమయ్యాము.
మేం నివసించే, పనిచేసే, విమానాలు ఎగిరించే ప్రాంతాలలోని ప్రజలకు మద్దతు ఇవ్వడం ఇదొక మార్గం” అని అన్నారు.
ఈ కార్యక్రమంపై చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఒక వ్యక్తి దీన్ని “హృదయానికి హత్తుకునే ఆఫర్” అని పిలిచి, క్రిస్మస్ ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.మరొకరు, “ఈ పిల్లలు, కుటుంబాలకు ఎంతో అద్భుతమైన అనుభవం ఇది” అని అన్నారు.
ఇక మిగిలిన ఫ్లైట్ షెడ్యూల్ చూస్తే క్లీవ్‌ల్యాండ్ (CLE) – డిసెంబర్ 10, ఫోర్ట్ లాడర్‌డేల్ (FLL) – డిసెంబర్ 10, గ్వామ్ (GUM) – డిసెంబర్ 13, డెన్వర్ (DEN) – డిసెంబర్ 14, నెవార్క్ (EWR) – డిసెంబర్ 14.