ప్రముఖ యూట్యూబర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సిరి( Siri Hanumanth ) ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోలతో పాటు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె మరో యూట్యూబర్ శ్రీహాన్ (Srihaan) తో ప్రేమలో ఉన్నారు.యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె బిగ్ బాస్( Bigg Boss ) అవకాశాన్ని కూడా అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ ద్వారా ఈమె భారీ స్థాయిలో నెగెటివిటీ మూట కట్టుకున్నారు.
బిగ్ బాస్ హౌస్లో మరొక కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తో( Shanmukh Jaswanth ) కలిసి ఈమె చేసినటువంటి రొమాన్స్ అందరికీ తీవ్ర స్థాయిలో విసుగు తెప్పించింది.ఇలా ఈమె వ్యవహార శైలి కారణంగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నంతసేపు భారీ స్థాయిలో నెగెటివిటీ మూట కట్టుకున్నారు.ఇలా ఈమె ప్రవర్తించడంతో చివరికి తన లవ్ బ్రేకప్ అయ్యే పరిస్థితిలు కూడా ఏర్పడ్డాయి.
అయితే తమ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని తొలగిపోయి సిరి తన ప్రియుడు శ్రీహాన్ తో ఎంత సంతోషంగా ఉన్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో సిరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున గ్లామర్ షో( Siri Glamor Show ) చేస్తూ ఫోటోలను షూట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె గోవాలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
గోవాలో ఎరుపు రంగు ఫ్రాక్ ( Red Frock ) ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అయితే ఈ ఫోటోలలో సిరి లుక్ కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో నేటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏంటి సిరి నువ్వు కూడా అందం కోసం సినిమా అవకాశాల కోసం ఫేస్ సర్జరీ ( Face Surgery ) చేయించుకున్నావా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం చాలా హాట్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు అవకాశాల కోసం సర్జరీలు చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈమె ఫేస్ లో కాస్త డిఫరెంట్ కనిపించడంతో నేటిజన్స్ సర్జరీ చేయించుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సిరి బుల్లితెర సీరియల్స్ అలాగే సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.అయితే తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా నటించిన జవాన్ సినిమాలో( Jawan Movie ) కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఇప్పుడిప్పుడే తనకు ఇండస్ట్రీలో మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పాలి.