ప్రేమతో దగ్గరైన ప్రేమికులు నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.అయితే ఈ నవ దంపతులపై యువతి కుటుంబీకులు విచక్షణారహితంగా దారిచేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన హత్నూర్ మండలంలోని నాస్తీపూర్ గ్రామంలో( Nastipur Village of Hatnoor Mandal ) చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
నాస్తీపూర్ గ్రామానికి చెందిన అనిల్( Anil ), రామచంద్రపురం మండలం స్టేషన్ నాగులపల్లి గ్రామానికి చెందిన అశ్విని( Ashwini ) కాస్త దగ్గరి బంధువులు.ఇరు కుటుంబాలకు తెలియకుండా వీరిద్దరూ నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివాహం చేసుకున్న తర్వాత తమకు ప్రాణహాని ఉందని ఈ నవ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు వీరి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.అప్పటినుంచి ఈ నవ దంపతులు నాస్తీపూర్ లోని అనిల్ ఇంటివద్దె ఉంటున్నారు.యువకుడి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో ఈ నవ దంపతులకు మళ్లీ వివాహం జరిపించాలని నిర్ణయించారు.
నవంబర్ 5వ తేదీ వివాహం జరిపించేందుకు పెళ్లి పత్రికలు ముద్రించడంతోపాటు పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు.

ఈ విషయం యువతి కుటుంబీకులకు తెలిసింది.సోమవారం తెల్లవారుజామున యువతి కుటుంబీకులతో పాటు బంధువులు నాస్తీపూర్ లోని అనిల్ ఇంటికి వచ్చి దాడి చేశారు.యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న క్రమంలో అడ్డుకోబోయిన భర్త అనిల్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
చుట్టుపక్కల ఉండే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన అనిల్ ను చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడైన అనిల్ తండ్రి నీరుడి లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనతో గ్రామంలో కాస్త గందరగోళం నెలకొంది.