సంపూర్ణేష్ బాబుకి కావాలనే అవకాశాలు లేకుండా చేస్తున్నారా... అసలు విషయం చెప్పిన నటుడు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా కామెడీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu ) ఒకరు.

 Sampoornesh Babu React On Rumours At His Movie Pramotions , Sampoornesh Babu, Ma-TeluguStop.com

హృదయ కాలేయం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సంపూర్ణేష్ బాబు అనంతరం కొబ్బరి మట్ట వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.కొద్ది కొద్ది రోజులుగా సినిమాలకు దూరమైనటువంటి ఈయన మార్టిన్ లూథర్ కింగ్ ( Martin Luther King ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా అక్టోబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

Telugu Martin Luther, Tollywood-Movie

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సంపూర్ణేష్ బాబు ఇన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో కొందరు కావాలని ఈయనని ఇండస్ట్రీలో తొక్కేసే( Film Industry ) ప్రయత్నం చేస్తున్నారని, ఈయనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఇదే ప్రశ్న ఈయనకు ఒక ఇంటర్వ్యూలో ఎదురయింది.

ఈ ప్రశ్నకు సంపూర్ణేష్ బాబు సమాధానం చెబుతూ.ఇండస్ట్రీలో నాకు ఎవరు శత్రువులు లేరు నన్ను కెరియర్ పరంగా తొక్కేసే ప్రయత్నాలు ఎవరూ చేయలేదు , అలాంటి ఇబ్బందులు తనకు ఎప్పుడు ఎదురు కాలేదని తెలియజేశారు.

Telugu Martin Luther, Tollywood-Movie

మరి కొంతమంది తన అనారోగ్య సమస్యల( Sampoornesh Babu Health ) కారణంగానే సినిమాలకు దూరంగా ఉన్నానంటూ కూడా వార్తలను ప్రచారం చేశారు.అయితే ఈ వార్తలలో కూడా ఏ మాత్రం నిజం లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలలో కూడా నటిస్తున్నానని ఈ సినిమా విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే ఆ సినిమాలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అంటూ ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు తన గురించి వస్తున్నటువంటి రూమర్ల పై స్పందించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా తన తదుపరి సినిమాల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube