Payal Rajputh : మంగళవారం ఆంధ్ర సీడెడ్ హక్కులు అన్ని రూ.కోట్లా.. పాయల్ రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ( Payal rajputh )గురించి మనందరికీ తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 ( RX 100 )సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ఈ బ్యూటీ.

 Mangalavaram Pre Release Business Payal Rajput Movie Andhra Ceded Rights Sold O-TeluguStop.com

ఈ సినిమాతో మంచి సక్సెస్ ని కూడా అందుకుంది.ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన కూడా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.ఆ సంగతి అటు ఉంచితే పాయల్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

Telugu Rx, Ajay Bhupathi, Andhra Ceded, Mangalavaram, Payal Rajputh, Tollywood-M

ఈ సినిమాకు అజయ్ భూపతికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది.పాయల్ రాజ్ పుత్ ( Payal rajputh )అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా పాయల్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఈ సినిమా గురించి ఇటీవలే మాట్లాడుతూ ఈ సినిమా తనకు రీ ఎంట్రీ అని కూడా తెలిపింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.అదేంటంటే ఈ సినిమాను ఆంధ్ర-సీడెడ్ కు కలిపి 7.20 కోట్లకు సింగిల్ పాయింట్ అమ్మేసారు.

Telugu Rx, Ajay Bhupathi, Andhra Ceded, Mangalavaram, Payal Rajputh, Tollywood-M

అమ్మడం అనేకంటే టీజర్ చూసి కొనుక్కున్నారని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు ఇలా కొనుకున్నవారు కేవలం ఆంధ్రనే ఆరు కోట్లు చెబుతున్నారు.అంటే సీడెడ్ మరో రెండు కోట్లు అనుకుంటే, విడుదలకు ముందే బయ్యర్ కు ఒక ఎనభై లక్షలు లాభం అన్నమాట.

పాయల్ రాజ్ పుత్ కు ఆర్ఎక్స్ 100 తరువాత ఇప్పటి వరకు హిట్ లేదు.అజయ్ భూపతి( Ajay Bhupathi ) కూడా తన రెండో సినిమాతో సక్సెస్ కొట్టలేదు.

కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది.ఆర్ఎక్స్ 100 మాదిరిగానే బోల్డ్ సినిమాలో బోల్డు వున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

బహుశా అందుకే ఈ క్రేజ్ కావచ్చు.మరి ఈ కాంబోలో రాబోతున్న సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube