లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్( Jayaprakash Narayan ) మంత్రి కేటీఆర్ ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు ఎవరికివారు దేశ రాజకీయాలపై అదేవిధంగా తెలుగు రాష్ట్రా రాజకీయాలపై తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు అందిస్తున్న “దళిత బంధు” పథకం పై జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.“దళిత బంధు( Dalit Bandhu Scheme )” పథకంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి టాక్సీ రావడం జరిగింది.అయితే ఆ టాక్సీ లోనే ఓ ఈవెంట్ కి నేను వెళ్లాల్సి వచ్చింది.ఈ సందర్భంగా ఆ కుర్రవాడు ఆనందానికి అవధులు లేవు.అతడు ఐటిఐలో స్పెషల్ కోర్స్ చేశాడు.
అతను నాతో మాట్లాడుతూ ఒకపక్క ట్యాక్సీ నడుపుతూనే మరోపక్క నేను చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఆ కుర్రోడి మాటలలో చలాకితనం కాన్ఫిడెన్స్ చూసి నాకు చాలా సంతోషం కలిగింది.ఐటిఐ చదివిన తర్వాత కొన్ని హెల్త్ కేర్ సెక్టార్లో పనిచేశాడు.తర్వాత ఈ “దళిత బందు” లో ఆ కుర్రవాడు బంధువుకి టాక్సీ రావటం జరిగింది.ఈ టాక్సీని వాళ్ళిద్దరూ షేర్ చేసుకుని నడుపుకుంటున్నారు.
సార్ నేను ఇది కాకపోతే మరొకటి చేస్తాను.అని జీవితం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఆ కుర్రవాడిలో అంత కాన్ఫిడెన్స్ రావడానికి అతడిలో ఉన్న మోటివేషన్ తో పాటు స్కిల్.ఇంకా సపోర్ట్ కూడా అందింది.
ఈ రకంగా “దళిత బంధు” పథకం దళితులకు తెలంగాణలో( Telangana ) ఎంతో మేలు చేస్తుందని జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు.