నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలం( Kethepalli )లోని మూసి కుడి కాలువపై మూసి ప్రాజెక్ట్( Musi Project ) నిర్మించిన సమయంలో కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో రైతులు కాలువ అవతలికి, ఇవతలకి పోవడానికి ఇరుకు వంతెన నిర్మించారు.ప్రస్తుతం ఆ వంతెన శిథిలావస్థకు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధానంగా పశువులు వంతెన పైనుండి వెళ్లే సమయంలో జారి కాలువల్లో పడుతున్నాయి.అదేవిధంగా ట్రాక్టర్లు వెళ్లాలంటే దాదాపు 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది.
అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వంతెన నిర్మించాలని రైతులు వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కుడికాలువపై నూతన వంతెన నిర్మించాలని రైతుల కోరుతున్నారు.
ఎన్నిసార్లు అడిగినా ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారని చెర్కుపల్లికి చెందినబయ్య సైదులు అనే రైతు వాపోయారు.బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్ని సార్లు అడిగినా ప్రతిపాదన పంపామని,ఆదేశాలు వచ్చాక బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్తున్నారు.
వెంటనే నూతన బ్రిడ్జి నిర్మించి రైతు కష్టాలను దూరం చేయాలి.లేకుంటే పశువులకు, మనుషులకు కూడా ఈ బ్రిడ్జి ప్రయాణం ప్రమాదమేనని అన్నారు.