కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపటి నిజామాబాద్ సభ వాయిదా పడింది.ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యవసర సమావేశం ఉండటంతో సభ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కాగా రాహుల్ గాంధీ ప్రారంభించిన కాంగ్రెస్ విజయభేరీ తొలి విడత బస్సు యాత్ర రేపు ఆర్మూర్ సభతో ముగియనుంది.ఈ క్రమంలో రేపు ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ వి పార్క్ హోటల్ నుంచి రాహుల్ గాంధీ బయలుదేరనున్నారు.ఉదయం 9 గంటలకు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర వద్ద సమావేశం నిర్వహించనున్నారు.ఉదయం 9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.ఉదయం 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న రాహుల్ మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గం మేడిపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు.రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు కోరుట్లలో సమావేశంలో పాల్గొననున్న రాహుల్ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభలో పాల్గొంటారు.సభ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ ఆర్మూర్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు వెళ్లనున్నారు.
అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం.