అమెరికా ప్రతినిధుల స్పీకర్ కెవిన్ మెక్‌కార్దీని( Kevin McCarthy ) అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.దీంతో అమెరికన్ రాజకీయాలు వేడెక్కాయి.
అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ పరిణామం రెండు పార్టీలపైనా ప్రభావం చూపే అవకాశం వుంది.మరి తదుపరి స్పీకర్ ఎవరు.
అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.అమెరికాలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తర్వాత శక్తివంతమైన పదవి స్పీకర్‌దే.
ఇలాంటి ఉన్నత పదవిని అందుకునేందుకు చాలామంది పోటీ పడే అవకాశం వుంది.సభలో మెజారిటీ నేపథ్యంలో కొంచెం కష్టపడితే మరోసారి రిపబ్లికన్లకే ఆ పదవి దక్కుతుంది.
రిపబ్లికన్ పార్టీ ఇటీవల నిర్వహించిన రహస్య బ్యాలెట్ ద్వారా తమ స్పీకర్ నామినీగా లూసియానాకు చెందిన స్టీవ్ స్కాలిస్‌ను ఎన్నుకున్నారు.అయితే స్కాలిస్ అధికారికంగా స్పీకర్ పదవి చేపట్టడానికి మొత్తం హౌస్ నుంచి మెజారిటీ ఓట్లను పొందాల్సి వుంటుంది.
ఆయన గెలవాలంటే 435 ఓట్లలో కనీసం 217 ఓట్లు రావాలి.ఇదే సమయంలో కొందరు రిపబ్లికన్లు స్కాలిస్‌పై విశ్వాసం చూపకపోవడంతో.ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు.గత శుక్రవారం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన ఒహియోకు చెందిన జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్ జిమ్ జోర్డాన్‌ను స్పీకర్ పదవికి నామినేట్ చేశారు.
కానీ ఓటింగ్ సమయంలో రిపబ్లికన్లు స్కాలిస్‌కు అనుకూలంగా ఓటేశారు.కానీ పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా వుండటంతో స్కాలిస్ పోటీ నుంచి విరమించుకున్నారు.
మెక్‌కార్దీకి ప్రత్యామ్నాయాన్ని కనుగోనలేకపోవడంతో రిపబ్లికన్లు( Republicans ) ముందుకు వెళ్లే మార్గం అనిశ్చితంగా వుంది.స్పీకర్‌ను ఎన్నుకునేందుకు గాను యూఎస్ ప్రతినిధుల సభ( US House of Representatives ) ఇవాళ ఓటింగ్ నిర్వహిస్తుందని సభ్యులకు ఆదివారం సమాచారం అందింది.మెజారిటీ రిపబ్లికన్లు ప్రస్తుతం తీవ్ర నిరాశలో వున్నారు.ఇజ్రాయెల్‌లో కొత్త యుద్ధం మొదలవ్వడం, ప్రభుత్వ నిధులు ఐదు వారాల్లో ముగుస్తూ వుండటంతో కొత్త స్పీకర్ ఎన్నిక అత్యంత అవసరం.
ఈ పరిణామాల మధ్యలో మరో వాదన కూడా వినిపిస్తుంది.మెక్‌కార్థీకే స్పీకర్‌గా మరోసారి అవకాశం కల్పించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఎవరూ ఊహించని అభ్యర్ధి స్పీకర్‌గా గెలుస్తారని కొందరు సభ్యులు వ్యాఖ్యానించారు.ఆశ్చర్యకరంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )సైతం స్పీకర్ రేసులో నిలవాలని భావించారు.
అయితే రిపబ్లికన్లు అందుకు ఒప్పుకోరని ఆయన తెలుసు.ఇంతలో ట్రంప్ మిత్రుడు జిమ్ జోర్డాన్‌కు( Jim Jordan ) మద్ధతు పెరుగుతోంది.సైన్యానికి నిధులు ఇస్తానని, ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన తర్వాత జోర్డాన్‌కు ముగ్గురు రిపబ్లికన్లు మద్ధతు పలికారు.సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ఎన్నికకు విపక్షం కూడా ఒకరిని బరిలో దించుతుంది.
అందుకు తగ్గట్లుగానే డెమొక్రాట్లు న్యూయార్క్ ప్రతినిధి హకీమ్ జెఫ్రీస్‌ను నామినేట్ చేశారు.