6 ఏళ్ళ పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేసిన ఏకైక హీరో గా విజయ్..తెలుగు స్టార్స్ కి కూడా సాధ్యపడలేదు!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో( Leo )’ చిత్రం మేనియా నే కనిపిస్తుంది.ఒక తమిళ సినిమా కోసం ప్రపంచం లో ఉన్న మూవీ లవర్స్ మొత్తం ఇంతలా ఎదురు చూడడం కేవలం రజినీకాంత్ సినిమాలకు మాత్రమే జరిగేది.

 Vijay Is The Only Hero Who Broke The Record Of 6 Years Old Pawan Kalyan.. Even T-TeluguStop.com

ఇప్పుడు విజయ్( Vijay ) విషయం లో కూడా అదే జరుగుతుంది.ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం వల్లే ఇంత క్రేజ్ ఏర్పడింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆయన గత చిత్రం ‘విక్రమ్’ సృష్టించిన ప్రభంజనం అలాంటిది.పైగా విజయ్ ఉన్న ఫామ్ లో ఏ స్టార్ హీరో కూడా లేడు.

ఫ్లాప్ సినిమాలను సైతం సూపర్ హిట్ చేసే రేంజ్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నాడు ఆయన, అలాంటి కాంబినేషన్ కలిస్తే ఇలాగే ఉంటుంది మరి.

Telugu Agnyaathavaasi, Jailer, Kamal Haasan, Kollywood, Tollywood, Vikram-Latest

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు.ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం ఎన్నో ఏళ్ళ నుండి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టడం ప్రారంభించింది.పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి( Agnyaathavaasi, )’ చిత్రం అప్పట్లో ఏ రేంజ్ అంచనాల నడుమ విడుదలైందో మనమంతా చూసాము.ఈ సినిమా నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 1.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది.ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు రాజమౌళి మినహా ఇప్పటి వరకు ఈ రికార్డు కి దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేకపోయారు.ఆరేళ్ళ నుండి పదిలంగా ఉన్న ఈ రికార్డు ని ఇప్పుడు ‘లియో’ చిత్రం బ్రేక్ చేయబోతుంది.ఇప్పటి వరకు ఈ సినిమాకి దాదాపుగా 1.2 మిలియన్ డాలర్స్ వచ్చింది.రేపటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగబోతున్నాయి.

Telugu Agnyaathavaasi, Jailer, Kamal Haasan, Kollywood, Tollywood, Vikram-Latest

అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ గ్రాస్ రికార్డు ని దాటేస్తుందని అంటున్నారు.వాళ్ళ అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి రెండు మిలియన్ డాలర్స్ వస్తుందని అనుకుంటున్నారు.అంటే రజినీకాంత్ ‘జైలర్( Jailer )’ మూవీ ప్రీమియర్స్ కంటే రెండింతలు ఎక్కువ అన్నమాట.

విడుదలకు ముందే ఈ రేంజ్ విద్వంసం ని సృష్టిస్తున్న సినిమాకి, విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అని ఆతృతగా ఎదురు చూస్తుంది ట్రేడ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube