చర్మం ఎప్పుడూ మృదువుగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

పోషకాహార నిపుణుల ప్రకారం కోడిగుడ్డు( Egg )ను సంపూర్ణ ఆహారంగా చెబుతూ ఉంటారు.దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 Home Remedies For Smooth And Soft Skin,soft Skin,facepacks,egg White,egg Facemas-TeluguStop.com

ఇది కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనిలో మన జుట్టుకు చర్మానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఉంటాయి.

అందుకే ప్రతి రోజు గుడ్డును తినమని పోషకాహారా నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు.అలాగే గుడ్డుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్( Face pack ) లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Telugu Egg Facemask, Egg Pack, Egg White, Tips, Oily Skin, Skin Care, Soft Skin-

గుడ్డులోని పచ్చసొనను వేరు చేసి ఒక చిన్న గిన్నెలో వేయాలి.ఆ పచ్చసొనకు ఒక స్పూన్ తేనె కలపాలి.ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టి ముఖానికి అప్లై చేయాలి.20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.వారం రోజుల పాటు ఇలా చేస్తే చర్మం పొడి బారడం తగ్గుతుంది.అలాగే పచ్చ సోనాలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లాక్స్ పొడి( Cornflakes Powder )ని వేసి బాగా కలపాలి.

అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు తేనె కూడా కలపాలి.ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టి మొహానికి పట్టించాలి.20 నిమిషాల పాటు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల పొడి చర్మ సమస్య దూరం అవుతుంది.

Telugu Egg Facemask, Egg Pack, Egg White, Tips, Oily Skin, Skin Care, Soft Skin-

అలాగే కొందరికి చర్మం జిడ్డుగా( Oily Skin ) ఉంటుంది.అప్పుడే మేకప్ వేసుకున్నా కూడా వెంటనే చర్మం జిడ్డుగా మారిపోతుంది.ఇలాంటివారు గుడ్డులోని తెల్ల సొనను ఉపయోగించవచ్చు.ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి.దాన్ని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయాలి.20 నిమిషాల పాటు అలాగే ఉండి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారం రోజులపాటు చేస్తే చర్మంపై అదనంగా నూనె ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది.అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల సొనను ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు,టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసి బాగా కలపాలి.

ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి బాగా మర్దన చేయాలి.తర్వాత 20 నిమిషాల పాటు అలానే వదిలేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం మృదువుగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube