ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా పెరిగింది అనే చెప్పాలి.ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ గా ”పుష్ప ది రూల్”(Pushpa The Rule) చేస్తున్నాడు.
పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తుంది.ఇక ఈ సినిమా 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు అల్లు అర్జున్ జాతీయ అవార్డు( National Award ) సైతం అందుకోవడంతో ఈయన పేరు మార్మోగిపోయింది.కాగా ఈ సినిమా నుండి తాజాగా ఒక న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమా పార్ట్ 2 కోసం సుకుమార్( Sukumar ) కథ, కథనాలు అన్ని మార్చేశాడు అని టాక్.పుష్ప రాజ్ పాత్రని, కథ నేపధ్యాన్ని మొత్తం మార్చసారట.
పార్ట్ 1 మొత్తం 1980-90 ల మధ్య సాగిన విషయం విదితమే.అయితే ఇప్పుడు పార్ట్ 2 మొత్తం 2000 లలో సాగుతుందట.మరి ఆ సమయంలో మెగాస్టార్( Megastar Chiranjeevi ) హవా నడిచిన విషయం తెలిసిందే.దీంతో పుష్పరాజ్ ఈ సినిమాలో మెగాస్టార్ హార్డ్ కొర్ ఫ్యాన్ గా కనిపించనున్నారట.
మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమాకు( Indra Movie ) సంబంధించిన పలు పోస్టర్స్ అవీ సినిమాలో కనిపిస్తాయనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.