పాయల్ రాజ్ పుత్ అంటే తెలియని చాలామంది కూడా ఆర్ఎక్స్ 100 ( Rx 100 ) హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్ కి ఎంతో మంచి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బోల్డ్ గా నటించడంతో ఈమెకు ఆ తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్లే వచ్చాయి.అయితే మొదటి సినిమాతోనే అలాంటి పాత్రతో ఎంట్రీ ఇచ్చేసరికి చాలామంది పాయల్ రాజ్ పుత్ ( Payal Rajputh ) ని తమ సినిమాల్లో కేవలం అలాంటి బోల్డ్ పాత్రల్లో తీసుకోవడానికే ఇష్టపడ్డారు.అలా చేసిన ఆ తర్వాత సినిమాల్లో కూడా పాయల్ కి అలాంటి అవకాశాలు వచ్చాయి.ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకి హీరోలతో,డైరెక్టర్లతో ఎఫైర్ వార్తలు వినిపించడం అనేది సహజం.
అయితే పాయల్ రాజ్ పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది.అయితే ఈమె ఓ డైరెక్టర్( Director ) ని అవకాశాల కోసం ప్రేమ పేరుతో వాడుకొని మోసం చేసింది అంటూ అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది.
అదేంటంటే పాయల్ హీరోయిన్ కాకముందు హీరోయిన్ అవ్వాలి అనే ఆశతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ లో రాణించింది.స్టార్ ప్లస్ లో వచ్చే చాలా సీరియల్స్ లో ఈమె సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేది.

ఇక అలా తన కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో వరుస అవకాశాలు ఇస్తూ ఓ సీరియల్ డైరెక్టర్ పాయల్ రాజ్ పుత్ తో ప్రేమలో పడ్డారట.ఇక పాయల్ కూడా ఆ డైరెక్టర్ తో అవకాశాల కోసం క్లోజ్ గానే ఉంటూ వచ్చేదట.ఇక ఆ డైరెక్టర్ పేరు రాకేష్ కుమార్( Director Rakesh Kumar ) .చాలా రోజులు వీరి ప్రేమాయణం సాగినప్పటికీ పెళ్లి చేసుకోవాలి అని రాకేష్ కుమార్ తన ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పారట.
అయితే ఇదే విషయాన్ని పాయల్ రాజ్ పుత్ కి చెప్పేసరికి నో నో నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నా గోల్ సినిమాల్లో హీరోయిన్ అవ్వడం.నా సినీ కెరియర్ సక్సెస్ అవ్వడం.
నా లక్ష్యం తీరకుండా నేను ఇప్పుడే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయలేను .పెళ్లి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అంటూ రిజెక్ట్ చేసిందట.

దాంతో అప్పటివరకు బాగానే ఉన్న పాయల్ ఒక్కసారిగా అలా చెప్పేసరికి రాకేష్ కుమార్ మనసు ముక్కలై ఆమెకు బ్రేకప్ ( Breakup ) చెప్పారట.ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర కేవలం అవకాశాల కోసమే నాతో ప్రేమ ఉన్నట్లు నటించింది అని పాయల్ రాజ్ పుత్ ని తిట్టుకున్నాడట.ఇక పాయల్ సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ మాత్రం సంపాదించుకుంది.