మరో వారం రోజుల్లో థియేటర్లలో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.ఈ మూడు సినిమాలు భారీ సినిమాలు కాగా ఈ మూడు సినిమాలు ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాయి.
అతి త్వరలో ఈ సినిమాల బుకింగ్స్ కూడా మొదలుకానున్నాయి.అయితే టికెట్ రేట్ల విషయంలో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోలిస్తే లియో( Leo Movie ) తోపు అని తెలుస్తోంది.
తెలంగాణ మల్టీప్లెక్స్ లలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) టికెట్ రేటు 250 రూపాయలుగా ఉండగా సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలుగా ఉంది.టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాకు మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు టికెట్ రేటు ఉండగా సింగిల్ స్క్రీన్ కు 150 రూపాయలుగా ఉందని తెలుస్తోంది.
అయితే లియో సినిమాకు మాత్రం మల్టీప్లెక్స్ లో టికెట్ రేటు 295 రూపాయలుగా ఉండగా సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలుగా ఉండనుందని భోగట్టా.
తెలుగు రాష్ట్రాల్లో తమిళ హీరో( Tamil Hero ) టికెట్ రేట్ల విషయంలో పైచేయి సాధిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.లియో సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వల్లే టికెట్ రేట్లు( Ticket Rates ) మరీ ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.దసరా సినిమాలు( Dasara Movies ) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
ఈ మూడు సినిమాల ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా నార్త్ ఇండియాలో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.బాలయ్య, రవితేజ, విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.