వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే - డీసీసీ అధ్యక్షుడు అది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం రోజున 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు.

 Congress Government Will Come Dcc President Adi Srinivas, Congress Government, D-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వారికి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారిని కోరారు.కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదని వారన్నారు న్యాయం జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి న్యాయం జరగలేదని వారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడిని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకుపోతామని వారన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు.పార్టీలో చేరిన వారిలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి చింతలపల్లి గంగారెడ్డి పూదారి లింబాద్రి ,గండి సాయి, మంచే సతీష్ కసోజి సంతోష్, ఉప్పులూటి రాజు, తోకల మహిపాల్ , దారిశెట్టి భరత్, బోండ్ల ప్రవీణ్ ,విలాసాగర్ గణేష్, అరిగెల మహేష్, రంగు గంగాధర్, దాసరి సూరి, గంగోత్రి తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్, డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి ,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం స్వామి, తర్రే లింగం ,ఎర్రం గంగ నర్సయ్య, మోహన్ రెడ్డి, మహిపాల్, దాసు ,అభిలాష్ , పుదారి మహిపాల్ ,గడ్డం శ్రీను ,ఇప్ప మహేష్,దయ్యాల శీను,పరంధాములు ,బొచ్చు హరీష్ , గంధo మనోజ్, నరేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube