చెన్నై వేదికగా భారత్ తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా( Australia ) పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.విరాట్ కోహ్లీ, కేఎల్.
రాహుల్ అద్భుతమైన భాగస్వామ్యం జోడించి భారత్ కు చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన విజయాన్ని అందించారు.కేఎల్ రాహుల్( KL Rahul ) 115 బంతుల్లో 8 ఫోర్లు రెండు సిక్సర్లతో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా రాహుల్ మ్యాచ్ కు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నాడు.
ఆసీస్ జట్టు 199 పరుగుల స్వల్ప స్కోర్ కు పరిమితం కావడంతో.తాను స్నానం చేసి విశ్రాంతి తీసుకుందామని భావించినట్లు తెలిపాడు.కాకపోతే పిచ్ పేసర్ లకు సహకరించడంతో కేవలం రెండు పరుగులకే తమ భారత జట్టు ఏకంగా మూడు వికెట్లను కోల్పోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తనకు పిచ్ లో ఏదో ఉంది.ముందు క్రీజులో నిలబడే ప్రయత్నం చేసి ఆ తర్వాత పరువులు చేయాలని తాను భావించినట్లు తెలిపాడు.
అప్పటికే క్రీజ్ లో ఉన్న విరాట్ కోహ్లీ( Virat Kohli ) కూడా కాసేపు టెస్ట్ క్రికెట్ లా ఆడమని సలహా ఇచ్చాడని తెలిపాడు.
పిచ్ పై ముందు పేసర్లకు, ఆ తరువాత స్పిన్నర్లకు సహకారం లభించింది.బంతి బాగా స్కిడ్ అయింది.అలా స్కిడ్ కావడం విరాట్ కోహ్లీ తో పాటు తనకు బాగా సహాయపడింది.
ఈ పిచ్ బ్యాటింగ్ చేసేందుకు అంత సులువైన వికెట్ కాదు.అలాగని మరి ఫ్లాట్ వికెట్ కూడా కాదు.
ఓ మంచి క్రికెట్ వికెట్ అని చెప్పవచ్చు.ఈ పిచ్ కొంత బౌలర్లకు, కొంత బ్యాటర్లకు అనుకూలమైనది.
ఇలాంటి పిచ్ లు సౌత్ ఇండియాలో మాత్రమే ఉంటాయి.మొత్తానికి భారత్ ఎలాగోలా తన తొలి మ్యాచ్లో మంచి ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అక్టోబర్ 11న భారత్ తన రెండో మ్యాచ్ న్యూఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది.