కొంత మంది హీరోలకు అదృష్టం ఉండదు.ఎంత కష్టపడినా సక్సెస్ రాదు, సినిమా బాగున్నా బాగాలేకపోయిన వారం రోజులు కూడా థియేటర్స్ లో ఉందని పరిస్థితి.
అలాంటి హీరోలలో ఒకడు సుధీర్ బాబు.( Sudheer Babu ) సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది గా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయనతో టాలెంట్ ఉంది.
విపరీతంగా కష్టపడే తత్త్వం ఉంది, కానీ జనాలు ఈయన సినిమాలు చూడడానికి థియేటర్స్ కి రారు.కనీసం మహేష్ బాబు( Mahesh Babu ) ఫ్యాన్స్ అయిన థియేటర్ కి వెళ్లి చూస్తారా అంటే, అది కూడా జరగడం లేదు.
ఒకప్పుడు వాళ్ళ సపోర్ట్ కాస్తో కూస్తో ఉండేది.ఇప్పుడు అది కూడా కట్ అయ్యింది.
ఇతను ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరో గా చేస్తే, కేవలం ‘ప్రేమ కథా చిత్రం’ ఒక్కటే సక్సెస్ సాధించింది.మిగిలిన చిత్రాలన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా ఎవరికీ తెలియడం లేదు.
ఇప్పుడు రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘మామా మశ్చీంద్ర’( Mama Mascheendra ) అనే సినిమా విడుదల అయ్యింది.ఇందులో ఆయన గెటప్, కాన్సెప్ట్ అన్నీ కాస్త కొత్తగా అనిపించాయి.ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అమృతం ఫేమ్ హర్ష వర్ధన్( Harshavardhan ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.అయితే ఈ సినిమాకి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనీసం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు.మహేష్ బాబు సొంత థియేటర్స్ అయిన ఏఎంబీ సినిమాస్ లో కూడా ఇదే పరిస్థితి.
ఇక విడుదలయ్యాక పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చింది.అయిన కూడా టికెట్స్ తెగలేదు.
మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు 10 లక్షల రూపాయిల గ్రాస్ వస్తే చాలా గ్రేట్ అనుకోవచ్చు, అంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం, ఇది నిజం గా ఘట్టమనేని ఫ్యాన్స్ కి అవమానకరం అనే చెప్పాలి.
అవతల కిరణ్ అబ్బవరం లాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేని హీరో సినిమా ‘రూల్స్ రంజన్’ కి( Rules Ranjan ) నెగటివ్ టాక్ వచినా కూడా డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.కానీ ఇక్కడ నేటి తరం సూపర్ స్టార్ బామ్మర్ది గా వచ్చిన సుధీర్ కి ఆడియన్స్ నుండి ఈ స్థాయి తిరస్కారం అనేది మామూలు విషయం కాదు.ఏమి చేసినా సుధీర్ బాబు సినిమాలు ఇక జనాలు చూడరు అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది.
ఇప్పటి నుండి అయిన ఆయన సినిమాలు మానేసి వేరే ఏదైనా బిజినెస్ చూసుకుంటే మంచిది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.లేకపోతే సినిమాల్లో విలన్ రోల్స్ కి బాగా పనికి వస్తావు అవి ట్రై చెయ్యండి అంటున్నారు.
ఇప్పటికే ఆయన బాలీవుడ్ లో ‘భాగీ’ అనే చిత్రం లో నెగటివ్ రోల్ చేసాడు.ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది కూడా, మరి సుధీర్ బాబు కెరీర్ రాబొయ్యే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.