ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కృష్ణా జలాలను తాకట్టు పెట్టారా లేదా అన్నది జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల మీద మన హక్కులు ఎలా కాపాడతారో చెప్పాలని దేవినేని అన్నారు.కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏపీ రైతాంగానికి గొడ్డలి పెట్టు వంటిదని విమర్శించారు.
ఈ క్రమంలో కృష్ణా జలాల అంశంపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.అంతేకాకుండా రాష్ట్రంలో టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహారిస్తుందని దేవినేని తీవ్ర ఆరోపణలు చేశారు.