ప్రభుత్వం మరియూ పార్టీ ప్రజల్లోనే ఉండాలంటున్న జగన్!

ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతూ దూకుడుగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్( YS Jagan Mohan Reddy ) మరోవైపు ప్రజల్లో కూడా పలుకుబడి పెంచుకోవాలని బావిస్తున్నట్టుగా తెలుస్తుంది .ఇప్పటివరకు తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వై ఏపీ నీడ్స్ జగన్ ? అన్న పేరుతో అక్టోబర్ 11 వ తారీకు నుంచి ఒక కొత్త కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు.దీనిలో వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకులు అందరూ తమ తమ కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది, ఈ కార్యక్రమం పై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఒక వర్క్ షాప్ ను వైసీపీ ( YCP )అధిష్టానం నిర్వహించింది.ప్రతి ఇంటికి వెళ్లివారికి ప్రబుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరించడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన మంచిని ఇప్పటి మంచిని బేరీజు వేసుకొని ఖచ్చితంగా తమకు లబ్ధి చేకూరింది అంటేనే తమకు ఓటు వేయమని అడగబోతున్నట్లుగా తెలుస్తుంది.

 Jagan Wants The Government And The Party To Be Among The People, Ys Jagan Mohan-TeluguStop.com
Telugu Ap, Gadapagadapaku, Jana Sena, Welfare Schemes, Ysjagan-Telugu Political

ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం( Gadapa Gadapaku Mana Prabhutvam ), జగనన్న సురక్ష పథకాలతో ఇంటింటి సర్వే చేపట్టిన వైసిపి అధిష్టానం ఇప్పుడు ఆ కార్యక్రమాలు చివరి దశకు చేరడంతో ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది .ఇలా ఎన్నికల వరకు కచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని తీరుస్తూ ప్రజల మద్దతు పొందాలని, అప్పుడే తామ ఆశించిన టార్గెట్ ను రీచ్ అవుతామని వైసిపి పార్టీ శ్రేణులకు జగన్ హితబోధ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.తమ సంక్షేమ పథకాల ఫలితాలు తమకు కచ్చితంగా ప్రయోజనం కలిగిస్తాయని నమ్ముతున్న జగన్ వాటిని ప్రజల్లో నిత్యం చర్చకు వచ్చేలా చేయడం కోసమే ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Gadapagadapaku, Jana Sena, Welfare Schemes, Ysjagan-Telugu Political

ఏది ఏమైనా తమ సంక్షేమం పైన పూర్తిస్థాయిలో ఆధారపడుతున్న జగన్ ప్రతిపక్షాల విమర్శలకు తమ అభివృద్ధి సమాధానం చెబుతుంది అన్న ధీమా లో ఉన్నారు మరి ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటాయో చూడాలిప్రభుత్వం మరియూ పార్టీ ప్రజల్లోనే ఉండాలంటున్న జగన్!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube