అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.రిపబ్లికన్ అభ్యర్ధుల్లో ట్రంప్ తర్వాతి స్థానంలో ఆయన వున్నట్లుగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఇప్పటికే జరిగిన రెండు రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లలో వివేక్ తన సత్తా చాటారు.ఈ క్రమంలో ఆయన వచ్చే నెలలో జరగనున్న మూడవ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌ను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ చర్చా కార్యక్రమానికి జాతీయ స్థాయిలో జరిగే పోలింగ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే అభ్యర్ధులను మాత్రమే అనుమతించాలని వివేక్ ప్రచార బృందం .రిపబ్లికన్ నేషనల్ కమిటీని కోరింది.
నవంబర్ 8న మియామీలో జరగనున్న మూడవ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌కు( 3rd Republican Primary Debate ) సంబంధించి నిబంధనలను మార్చాలని వివేక్ రామస్వామి బృందం కోరినట్లుగా సీబీఎస్ న్యూస్ సోమవారం కథనాన్ని ప్రసారం చేసింది.దీని ప్రకారం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) పక్కనబెట్టి.జాతీయ పోలింగ్‌లో స్థానం దక్కించుకున్న మొదటి నలుగురు అభ్యర్ధులను మాత్రమే చర్చా వేదికపైకి అనుమతించాలని రిపబ్లికన్ నేషనల్ కమిటీ సీఈవో బెన్ యోహో ఓ లేఖలో పేర్కొన్నారు.నవంబర్‌లో మరో పనికిరాని చర్చా కార్యక్రమం జరగొద్దని ఆయన అభిప్రాయపడ్డారు.
పొలిటికో వార్తాపత్రిక ప్రకారం.వివేక్ రామస్వామి, ట్రంప్, డిసాంటిస్, నిక్కీ హేలీలు మూడవ డిబేట్‌కు అర్హత సాధించినట్లుగా కనిపిస్తున్నారు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు జరిగిన రెండు డిబేట్లకు దూరంగానే వున్నారు.అలాగే మియామీలో జరిగే మూడో చర్చా కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకారని ట్రంప్ ప్రచార సలహాదారు క్రిస్ లాసివిటా సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
కానీ పోలింగ్ సర్వేల్లో ట్రంప్ రిపబ్లికన్‌లలో అందరికంటే ముందంజలో వున్నారు.మరోవైపు విరాళలు ఇచ్చే దాతల థ్రెషోల్డ్‌ను 70,000 డాలర్ల నుంచి 1,00,000 డాలర్లకు పెంచాలని యోహో కోరారు.