మంచు విష్ణు కన్నప్ప బడ్జెట్‌ ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడుతారు

మంచు ఫ్యామిలీ( Manchu Family ) కి చెందిన విష్ణు చాలా సంవత్సరాలుగా భక్త కన్నప్ప కాన్సెప్ట్‌ తో సినిమా ని చేయాలని ఆశ పడుతున్నాడు.మొదట తనికెళ్ల భరణి( Tanikella Bharani ) స్క్రిప్ట్‌ తో కన్నప్ప సినిమా ను చేయాలి అనుకున్న విష్ణు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సొంతంగానే కన్నప్ప సినిమా ను మొదలు పెట్టాడు.

 Manchu Vishnu Bhakta Kannappa Movie Budget Interesting Update,manchu Vishnu,bhak-TeluguStop.com

ఈ సినిమా లో గెస్ట్‌ అప్పియరెన్స్ గా ప్రభాస్ ని నటింపజేస్తున్నట్లుగా విష్ణు ప్రకటించాడు. ప్రభాస్( Prabhas ) గెస్ట్‌ అప్పియరెన్స్ తో కచ్చితంగా కన్నప్ప స్థాయి పది రెట్టు పెరగడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bhakta Kannappa, Manchu, Manchu Vishnu, Mohan Lal, Prabhas-Movie

తాజాగా మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్( Mohan lal ) ను ఈ సినిమా లో నటింపజేస్తున్నట్లుగా స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు.దాంతో సినిమా కి పాన్ ఇండియా అప్పీల్ మరింతగా పెరిగింది అన్నట్లుగా టాక్ వస్తుంది.ఇక ఈ సినిమా బడ్జెట్‌ గురించి వింటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ఈ మధ్య కాలం లో స్టార్‌ హీరోలు కూడా భారీ బడ్జెట్‌ సినిమా లు చేయాలి అంటే బాబోయ్ అంటూ భయపడుతున్నారు.అలాంటిది కన్నప్ప సినిమా( Bhakta Kannappa ) కోసం విష్ణు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయబోతున్నాడట.విష్ణు సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా పాతిక కోట్లు వసూళ్లు సాధించడం అసాధ్యం.

Telugu Bhakta Kannappa, Manchu, Manchu Vishnu, Mohan Lal, Prabhas-Movie

అలాంటిది ఆయన కన్నప్ప సినిమా కి ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు మాత్రం విష్ణు( Manchu Vishnu ) కి కన్నప్ప సినిమా పై ఉన్న నమ్మకం చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.మొత్తానికి సోషల్‌ మీడియా లో కన్నప్ప గురించి ట్రోల్స్ తో పాటు ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ సినిమా లో మోహన్ బాబు తో కీలక పాత్ర చేయించాలని విష్ణు ఆశ పడుతున్నాడు.మరి అది సాధ్యమేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube