వైరల్: పిల్ల ఏనుగుని ఒకేసారి వెంబడించిన 3 సింహాలు.. జరిగింది ఇదే!

సోషల్‌ మీడియాలో నిత్యం చాలా రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి, అది అందరికీ తెలిసిందే.అయితే అందులో కొన్ని కొన్ని వీడియోలు మాత్రమే నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు.

 Three Lions Hunt Lost Baby Elephant Viral Video Details, Elephant, Viral Latest,-TeluguStop.com

ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరీ ముఖ్యంగా అడవి జంతువులు, పెంపుడు జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్( Viral ) కావడం మనం చూస్తూ వున్నాం.ఇంకా మనిషి గతంలో మునుపెన్నడూ చూడని, చూడలేని వీడియోలను ఇంటర్‌నెట్‌ ప్రపంచం మన కళ్ల ముందుకు తెస్తుంది.

ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది.

అడవిలో ఓ మందలోంచి తప్పిపోయిన ఏనుగు పిల్ల( Baby Elephant ) ఒకటి తన తల్లి కోసం వెతుకుతూ వెతుకుతూ మూడు సింహాల కంట బడింది.

ఇంకేముంది, కట్ చేస్తే, అవి అదును చూసి ఏనుగుపై దాడి చేసేందుకు వెంబడించాయి.ఈ షాకింగ్ వైరల్ వీడియోలో 3 సింహాలు( Three Lions ) పిల్ల ఏనుగును వెంబడిస్తూ వేటాడేందుకు సిద్ధపడ్డాయి.

ఈ వీడియోని వాస్తవానికి దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో( Kruger National Park ) బ్రెంట్ ష్నప్ చిత్రీకరించారు.

Telugu Attack, Elephant, Krugernational, Hunt Elephant, Baby Elephant, Africa, H

అక్కడ ప్రశాంతంగా ఉన్న అడవిలో మధ్యలో ఓ మగ సింహం మరో రెండు సింహాలతో కలిసి రోడ్డు దాటడం మనకు స్పస్టంగా కనిపిస్తోంది.అంతలోనే ఒక పిల్ల ఏనుగు తన గుంపులోంచి తప్పిపోయి ఒంటరిగా వెళ్లటం సింహాల( Lions ) కంటపడుతుంది.దాంతో అవి పిల్ల ఏనుగును వెంబడించడం ప్రారంభించాయి.

పరిస్థితిని పసిగట్టిన సింహాలు తల్లి ఏనుగు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు ఒంటరిగా ఉందని అర్ధం చేసుకున్నాయి.

Telugu Attack, Elephant, Krugernational, Hunt Elephant, Baby Elephant, Africa, H

దాంతో తమకు మంచి విందు భోజనం అనుకున్న సింహాలు ఆ పిల్ల ఏనుగును వెంబడిస్తాయి.ఇక సింహాలు తన వెంటపడటం గమనించిన ఏనుగు పిల్ల అప్రమత్తంగా వ్యవహరించింది.ఎదురుగా ఉన్న గుబురు చెట్లల్లోకి వెళ్లి మాయమైపోతుంది.

అవును, అదృష్టవశాత్తూ సింహాలు దగ్గరకు రాకముందే పిల్ల ఏనుగు వాటికి కనిపించకుండా తప్పించుకోగలిగింది.దాంతో ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube