వైరల్: పిల్ల ఏనుగుని ఒకేసారి వెంబడించిన 3 సింహాలు.. జరిగింది ఇదే!

సోషల్‌ మీడియాలో నిత్యం చాలా రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి, అది అందరికీ తెలిసిందే.

అయితే అందులో కొన్ని కొన్ని వీడియోలు మాత్రమే నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరీ ముఖ్యంగా అడవి జంతువులు, పెంపుడు జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్( Viral ) కావడం మనం చూస్తూ వున్నాం.

ఇంకా మనిషి గతంలో మునుపెన్నడూ చూడని, చూడలేని వీడియోలను ఇంటర్‌నెట్‌ ప్రపంచం మన కళ్ల ముందుకు తెస్తుంది.

ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది.అడవిలో ఓ మందలోంచి తప్పిపోయిన ఏనుగు పిల్ల( Baby Elephant ) ఒకటి తన తల్లి కోసం వెతుకుతూ వెతుకుతూ మూడు సింహాల కంట బడింది.

ఇంకేముంది, కట్ చేస్తే, అవి అదును చూసి ఏనుగుపై దాడి చేసేందుకు వెంబడించాయి.

ఈ షాకింగ్ వైరల్ వీడియోలో 3 సింహాలు( Three Lions ) పిల్ల ఏనుగును వెంబడిస్తూ వేటాడేందుకు సిద్ధపడ్డాయి.

ఈ వీడియోని వాస్తవానికి దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో( Kruger National Park ) బ్రెంట్ ష్నప్ చిత్రీకరించారు.

"""/" / అక్కడ ప్రశాంతంగా ఉన్న అడవిలో మధ్యలో ఓ మగ సింహం మరో రెండు సింహాలతో కలిసి రోడ్డు దాటడం మనకు స్పస్టంగా కనిపిస్తోంది.

అంతలోనే ఒక పిల్ల ఏనుగు తన గుంపులోంచి తప్పిపోయి ఒంటరిగా వెళ్లటం సింహాల( Lions ) కంటపడుతుంది.

దాంతో అవి పిల్ల ఏనుగును వెంబడించడం ప్రారంభించాయి.పరిస్థితిని పసిగట్టిన సింహాలు తల్లి ఏనుగు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు ఒంటరిగా ఉందని అర్ధం చేసుకున్నాయి.

"""/" / దాంతో తమకు మంచి విందు భోజనం అనుకున్న సింహాలు ఆ పిల్ల ఏనుగును వెంబడిస్తాయి.

ఇక సింహాలు తన వెంటపడటం గమనించిన ఏనుగు పిల్ల అప్రమత్తంగా వ్యవహరించింది.ఎదురుగా ఉన్న గుబురు చెట్లల్లోకి వెళ్లి మాయమైపోతుంది.

అవును, అదృష్టవశాత్తూ సింహాలు దగ్గరకు రాకముందే పిల్ల ఏనుగు వాటికి కనిపించకుండా తప్పించుకోగలిగింది.

దాంతో ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

జపాన్‌లో ఆ ప్రాంతాన్ని ఏలియన్స్ ఆక్రమించేశాయా.. ఫొటోలు వైరల్?