పాకిస్థాన్ టీవీ న్యూస్ ప్రోగ్రామ్స్ ఫన్నీగా, వింతగా ఉంటాయి.అవి తరచుగా భారతదేశంలోని నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తాయి.
అయితే గతంలో ఎన్నడూ జరగని సంఘటన తాజాగా జరిగింది.రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు టీవీ లైవ్‌లో ఫైట్ కు దిగారు.
అందరూ చూస్తున్న లైవ్ షోలో( Live TV Show ) తాము ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి వారు ఒకరినొకరు కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టారు.వారి మధ్య గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే టీవీ సిబ్బింది వచ్చి మరీ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్‌లో లైవ్ టీవీ షో సందర్భంగా పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్( Senator Afnan Ullah Khan ) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అవమానించారు.దీంతో కోపోద్రిక్తుడైన పీటీఐ న్యాయవాది షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్.
( Sher Afzal Khan Marwat ) అఫ్నాన్ ఉల్లా ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టాడు.దాంతో అఫ్నాన్ ఉల్లా ఖాన్ మార్వాత్‌ను నేలపై పడేసి, తన్నడం, కొట్టడం ప్రారంభించాడు.
దీంతో టీవీ సిబ్బంది జోక్యం చేసుకుని గొడవను ఆపేశారు.
పాకిస్థాన్ టీవీలో( Pakistani TV ) సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్, షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ మధ్య జరిగిన ఫైటింగ్ కి సంబంధించిన వీడియో భారత్‌లో వైరల్‌గా మారింది.జనాలు ఆ వీడియోను షేర్ చేస్తూ నవ్వుకుంటున్నారు.ఎన్నో లైవ్ డిబేట్ షోలలో గొడవలు చూశాం కానీ డబ్ల్యూడబ్ల్యూఈ లోలాగా ఇలాంటి ఫైటింగ్ ఎక్కడా చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.
రబీందర్ సింగ్ రాబిన్ అనే జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “ఇమ్రాన్ ఖాన్( Imran Khan ) లాయర్ షేర్ అజల్, పీఎంఎల్-ఎన్ సెనేటర్ అఫ్నాన్ ఉల్లా లైవ్ టీవీలో కొట్లాటకు దిగారు” అని రాశారు.ఈ వీడియోపై ఏఎన్‌ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ స్పందిస్తూ, “ఇది ఫన్నీగా ముగుస్తుంది.” అని అన్నారు.ఇదే వీడియోను @ranjha∅∅1 ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు.
ఒక్క నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉన్న ఆ వీడియో 1 లక్ష దాక వ్యూస్ పొందింది.