తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు అవుదామని వస్తూ ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది మాత్రమే మంచి అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్తూ ఫైనల్ గా హీరో అయి సక్సెస్ కొడుతూ ఉంటారు.అయితే కొంతమంది హీరో లా కొడుకులు హీరోలుగా వచ్చి సక్సెస్ అవుతూ ఉంటే మరికొందరు మాత్రం ఆశించిన సక్సెస్ లను అందుకోలేకపోతున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రొడ్యూసర్ల కొడుకులు గా( Producers Sons ) ఇండస్ట్రీకి వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోల్లో వెంకటేష్, అల్లు అర్జున్, నితిన్ లాంటివారు ముందు వరుసలో ఉంటారు.ప్రొడ్యూసర్ కొడుకులుగా ఇండస్ట్రీకి వచ్చి ఫ్లాప్ అయిన హీరోలలో వడ్డే నవీన్( Vadde Naveen ) ఒకడు అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) లాంటి నటులు ఉన్నారు.అయితే వెంకటేష్ అల్లు అర్జున్ నితిన్ లాంటి వాళ్లు సక్సెస్ అవ్వడానికి వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం…
ముందుగా సక్సెస్ అయిన హీరోలు అయినా వెంకటేష్,( Venkatesh ) అల్లు అర్జున్( Allu Arjun ) లను తీసుకుంటే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా స్క్రిప్లను చూసుకుంటూ ఆ సినిమా కి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకొని సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్తారు.సినిమా సెట్స్ మీదికి రావడానికి ముందే గట్టిగా వాళ్ళ బాడీని చేంజ్ చేసుకుని అప్పుడు షూటింగ్ స్పాట్ కి దిగుతారు.ఇలా ఇంత మంచి ప్లానింగ్ వేసుకుంటూ ముందుకు వెళ్తేనే వీళ్లకు కొన్ని విజయాలనేవి దక్కుతున్నాయి.
ఇక ఏ ప్లానింగ్ లేకుండా నార్మల్ గా సినిమాల్లో హీరో అయిపోవాలి అని ఇండస్ట్రీ లో కి వచ్చిన కొంతమంది ప్రొడ్యూసర్ల కొడుకులు ఇండస్ట్రీలో హీరోలు అవుతారు కానీ వాళ్లకి టాలెంట్ లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు.వడ్డే రమేష్ కొడుకైన వడ్డే నవీన్ కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ కొడుకే అయినప్పటికీ ఆయనకి సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ మొదట్లో తనకంటూ ఏర్పారచుకున్న నవీన్ అనతి కాలంలోనే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఇక ఇంకో హీరో అయిన సాయి శ్రీనివాస్ బెల్లంకొండ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వాటితో ఆయనకి ఒక్క హిట్ సినిమా కూడా పడటం లేదు దానివల్లే ఆయన ఇండస్ట్రీలో టాప్ హీరోగా సర్వైవల్ అవలేకపోతున్నారు.