తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో శర్వానంద్ ( Sharvanand )ఒకరు.ఆయన ఇప్పటికే చాలా సినిమాలు చేసినప్పటికీ వాటిలో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉంటున్నాయి.
అందుకే ఆయన ఇప్పుడు హీరో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే సిద్ధార్థ్ తో ఒక మల్టీ స్టారార్ సినిమా చేశారు.
అదే మహాసముద్రం…( Maha Samudram )ఈ సినిమా కి అజయ్ భూపతి డైరెక్షన్ చేసినప్పటికీ ఈ సినిమా కథ పెద్దగా జనానికి నచ్చకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.అయినప్పటికీ శర్వానంద్ ఎక్కడ నిరాశ పడకుండా మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన చేసిన ఒకే ఒక్క జీవితం సినిమా( Oke Oka Jeevitham ) మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన ఒక కథ ఆయనకు బాగా నచ్చడంతో ఆయన మరో యంగ్ హీరో అయిన సిద్ధిజొన్నలగడ్డతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది కాగా సిద్దు జొన్నలగడ్డ మాత్రం ఈ సినిమాలో పోలీస్ పాత్ర పోషించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా కనుక మంచి విజయాన్ని అందుకుంటే శర్వానంద్ తన కెరియర్లో వరుస విజయాలనుసొంతం చేసుకుంటాడు.
ఇక ఈ సినిమా చాలావరకు ఫ్రెష్ గా ఉండే విధంగా డైరెక్టర్ ఆయన రాసుకున్న సీన్ల మీద చాలా శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.కానీ ఇటు శర్వానంద్,అటు సిద్దు జోన్నలగడ్డ( Siddi jonnalagadda ) ఇద్దరు కూడా ఇంతకు ముందు వాళ్ళు ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ సినిమాని తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.అన్నీ కుదిరితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదికి వెళ్లే అవకాశం అయితే ఉంది.
ఇక ఇప్పటికే డైరెక్టర్ బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకొని రెడీగా ఉన్నాడు.ఇక వీళ్లు ఎప్పుడు షూట్ స్టార్ట్ అంటే అప్పుడు షూటింగ్ చేయడానికి ఆయన మాత్రం రెడీగా ఉన్నాడు…
.